కన్నడ నటుడు యాష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన సీరియల్ నటుడిగా కెరియర్ను మొదలు పెట్టి మంచి గుర్తింపు సంపాదించుకొని ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. ఇక యాష్ కన్నడ సినీ పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించి అక్కడ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాంటి సమయం లోనే ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కే జి ఎఫ్ సిరీస్ మూవీ లో హీరో గా నటించాడు. పాన్ ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంది.

మూవీ తో యాష్ కి ఒక్క సారిగా ఇండియా వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఈ సినిమా తర్వాత యాష్ నెక్స్ట్ మూవీ ని స్టార్ట్ చేయడానికి అత్యంత ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఇక కొంత కాలం క్రితమే యాష్ "టాక్సిక్" అనే సినిమాను మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. కొంత కాలం క్రితం ఈ మూవీ కి సంబంధించిన చిన్న గ్లీమ్స్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇకపోతే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ మూవీ కి ఇండియా వ్యాప్తంగా సంగీత దర్శకుడిగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది.

అనిరుద్ సంగీతం అందించే సినిమాల మ్యూజిక్ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకుంటారు. ఇక టాక్సిక్ మూవీ కి అనిరుద్ సంగీతం అందించనున్నాడు అనే వార్తలు బయటకు రావడంతో ఈ మూవీ సంగీతం కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది భావిస్తున్నారు. ఏదేమైనా కూడా టాక్సిక్ మూవీ పై ప్రస్తుతానికి ఇండియా వ్యాప్తంగా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: