తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన నిర్మాతలలో దిల్ రాజు ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలను నిర్మించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన సినిమాల ద్వారా ఎంతో మంది దర్శకులు , నటీ నటులు , టెక్నీషియన్స్ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. అందులో కొంత మంది ప్రస్తుతం అద్భుతమైన స్థాయిలో కెరియర్ను కొనసాగిస్తున్నారు. దిల్ రాజు బ్యానర్ లో రూపొందిన కొన్ని సినిమాలలో నాని కూడా నటించాడు. దిల్ రాజు నిర్మించిన ఎంసీఏ , నేను లోకల్ సినిమాల్లో హీరోగా నటించిన నాని ఈ రెండు మూవీలతో కూడా మంచి విజయాలను అందుకున్నాడు. దిల్ రాజు బ్యానర్లో కొన్ని సినిమాలను నాని మిస్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి దిల్ రాజు బ్యానర్లో ఏ సినిమాలను నాని మిస్ చేసుకున్నాడు అనే వివరాలను తెలుసుకుందాం.

తాజాగా నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తమ్ముడు అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. సప్తమి గౌడ , వర్ష బొల్లమ్మ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా తాజాగా థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాలో మొదట హీరో గా నితిన్ ను కాకుండా నాని ని శ్రీరామ్ వేణు హీరోగా అనుకున్నాడు. అందులో భాగంగా ఆయనను సంప్రదించగా నాని ఇతర మూవీలతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా చేయలేను అని చెప్పాడట. దానితో నితిన్ ఈ మూవీ లో హీరో గా సెలెక్ట్ చేసుకున్నారట. ఇకపోతే బలగం మూవీ తో దర్శకుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వేణు "ఎల్లమ్మ" అనే టైటిల్ తో నితిన్ హీరో గా దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ లో హీరో గా మొదటి ఆప్షన్ నితిన్ కాదంట. ఈ సినిమాలో మొదటగా హీరో గా నాని ని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల నానిసినిమా నుండి తప్పుకోవడంతో నితిన్ ను ఈ మూవీ లో హీరో గా ఎంచుకున్నారట. ఇలా దిల్ రాజు బ్యానర్లో రెండు సినిమాలను నాని మిస్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: