`హరి హర వీరమల్లు` సినిమాను ప్రారంభించింది ఒకరైతే ముగించింది మరొకరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో 2020న ఈ చిత్రం పట్టాలెక్కింది. ఏ.ఎం. రత్నం నిర్మాత. నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఎంపికైంది. మొదట్లో షూటింగ్ బుల్లెట్ ట్రైన్ మాదిరి స్పీడ్ గా సాగింది. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో బిజీ కావడం వల్ల వీరమల్లు షూటింగ్ కు బ్రేకులు పడుతూ వచ్చాయి. ఏపీలో ఎన్నికల ప్రభావం ఈ సినిమాపై గట్టిగా పడింది. అలాగే పవన్ కళ్యాణ్ మరికొన్ని కొత్త ప్రాజెక్ట్‌ల‌ను లైన్ లో పెట్టడంతో హరిహర వీరమల్లు ఓ కొలిక్కి రాలేకపోయింది.


ఈ క్రమంలోనే డైరెక్టర్ క్రిష్ ఇక వెయిట్ చేయలేక వీరమల్లు నుంచి వాకౌట్ చేశారు. దాంతో ప‌వ‌న్ ఫ్యాన్స్ లో గుబులు మొద‌లైంది. సినిమా ఆగిపోయింద‌ని అంతా అనుకున్నారు. స‌రిగ్గా అదే స‌మ‌యంలో  ఏ.ఎం. రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలను తీసుకుని సినిమాను పూర్తి చేశారు. కానీ క్రిష్ ఈ సినిమాను మ‌ధ్య‌లోనే ఎందుకు వ‌దిలేశాడు? అనే ప్ర‌శ్న‌ చాలా మందిలో ఉంది. తాజాగా ఈ విష‌యంపై ఏ.ఎం. రత్నం క్లారిటీ ఇచ్చారు. హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ప్రాజెక్ట్ నుంచి క్రిష్‌ వెళ్లిపోవడానికి కార‌ణం ఆయనకు మరో కమిట్మెంట్ ఉండటమే అని.. ఆయ‌న తప్పుకోవడంతో జ్యోతికృష్ణ‌కు దర్శకత్వ బాధ్యతలు ఇవ్వ‌మ‌ని చెప్పింది పవన్ కళ్యాణ్ గారే అని ఏ.ఎం. రత్నం తెలిపారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


కాగా, అనేక వాయిదాల అనంతరం హరిహర వీరమల్లు చిత్రం జూలై 24న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఇటీవల బయటికి వచ్చిన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి భారీ అంచ‌నాల న‌డుమ రాబోతున్న వీర‌మ‌ల్లు చిత్రం పవన్ క‌ళ్యాణ్ కు ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు


మరింత సమాచారం తెలుసుకోండి: