ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ల సినిమాలు ఎక్కువైపోతున్నాయి . మరీ ముఖ్యంగా "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు".. ఆర్ఆర్ఆర్ , సల్లార్ లాంటి సినిమాలు చూశాక చాలామంది స్టార్స్ మల్టీస్టారర్ మూవీస్ గా తమ కాన్సెప్ట్ ఎక్కించుకోవడానికి సిద్ధమైపోతున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఫిలిమ్ సర్కిల్స్ లో ఈ న్యూస్ బాగా వైరల్ గా మారింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని ఓ సినిమాకి కమిట్ అయ్యాడు అన్న వార్తలు ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా వినిపించాయి .


"కుబేర" సినిమాతో సూపర్ డూపర్ హిట్ మూవీని అందుకున్న శేఖర్ కమ్ముల నానితో ఓ సినిమా చేయబోతున్నాడు అంటూ ఓ న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో బాగా  ఎక్కువగా వినిపించింది. ఈ కాంబో కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో వెయిటింగ్. ఇన్నాళ్లకి ఈ కాంబో సెట్ అయ్యింది అని హ్యాపీ గా ఫిల్ అవుతున్నారు జనాలు.  అయితే ఈ సినిమా మల్టీస్టారర్ మూవీ అంటూ తాజాగా ఓ న్యూస్ తెర పైకి వచ్చింది . అన్నరోల్ లో నాని నటించబోతున్నాడట . ఇది చాలా ఢిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అంటూ తెలుస్తుంది.

 

ఇక్కడ తమ్ముడు రోల్ కోసం నాగచైతన్య ని అనుకున్నారట డైరెక్టర్ శేఖర్ కమ్ముల . ఆల్రెడీ శేఖర్ కమ్ముల.. నాగచైతన్య మంచి జాన్ జిగిడి  ఫ్రెండ్షిప్ ఉంది . వీళ్ళ కాంబోలో "లవ్ స్టోరీ " అనే సినిమా వచ్చింది . రీసెంట్ గా కుబేర సినిమా ప్రమోషన్స్ కి కూడా నాగచైతన్య హెల్ప్ చేశారు . వీళ్ళ కాంబోలో  ఇప్పుడు సినిమా రాబోతుంది అన్న వార్త బాగా వైరల్ గా మారింది . ఇద్దరు న్యాచురల్ హీరోస్ కలిసి ఒక న్యాచురల్ డైరెక్టర్ తో సినిమాలో  నటిస్తే ఆ మూవీ ఎంత న్యాచురల్ గా ఉంటుందో అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . ఈ మూవీకి సంబంధించిన విషయాలను ట్రెండ్ చేస్తున్నారు . చూడాలి మరి మూవీ ఈ ఎంతవరకు సక్సెస్ అవుతుంది  అనేది..???

మరింత సమాచారం తెలుసుకోండి: