మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని శృతి హాసన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె లోక నాయకుడు కమల్ హాసన్ కూతురు. శృతి హాసన్ తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టింది. కానీ ఈమెకు తెలుగు సినిమా ద్వారా మొట్ట మొదటి బ్లాక్ బస్టర్ విజయం దక్కింది. ఈమె చాలా సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. శృతి హాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. అందులో భాగంగా తెలుగు ప్రజల గురించి , తెలుగు ఇండస్ట్రీ గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది. గబ్బర్ సింగ్ సినిమా నా లైఫ్ ను మలుపు తిప్పింది.

మొదట ఆ సినిమాలో నన్ను నటించమని హరీష్ శంకర్ అడిగాడు. కానీ నేను అలా అడిగినప్పుడు ఆ సినిమా చేయను అని చెప్పాను. కానీ మీరే ఈ సినిమాలో హీరోయిన్గా చేయాలి అని హరీష్ శంకర్ పట్టుబట్టడంతో ఆ మూవీ లో నటించడానికి ఓకే చెప్పాను. నా ఎన్నో మూవీస్ మంచి విజయాలను అందుకున్నాయి. కానీ నాకు మొట్ట మొదటి హిట్ మాత్రం టాలీవుడ్ మరియు తెలుగు ప్రేక్షకుల నుండే దక్కింది అని ఆమె చెప్పుకొచ్చింది. ఇకపోతే గబ్బర్ సింగ్ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరీష్ శంకర్మూవీ కి దర్శకత్వం వహించాడు. 

బండ్ల గణేష్ ఈ మూవీ ని నిర్మించగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ కంటే ముందు శృతి హాసన్ చాలా సినిమాలలో హీరోయిన్గా నటించింది. కానీ ఆమె గబ్బర్ సింగ్ సినిమా కంటే ముందు నటించిన ఏ సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర విజయాన్ని అందుకోలేదు. అలాంటి సమయంలో ఈమె నటించిన గబ్బర్ సింగ్ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. అలాగే ఈమె ఆ సినిమాలో తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ఈ సినిమా తర్వాత ఈమెకు అద్భుతమైన అవకాశాలు తెలుగు సినీ పరిశ్రమలో దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: