
కెరీర్ మొదట్లో ఆయన స్టేజిపై చిన్న చిన్న నాటకాలు వేసుకునేవాళ్ళు. ఆ తర్వాత అంచలంచెలుగా ఎదుగుతూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలనిజానికి ఓ కొత్త భాష్యాన్ని తీసుకొచ్చాడు. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో అవకాశాల కోసం చాలా కష్టపడ్డాడు కోట శ్రీనివాస్ రావు గారు . "ప్రాణం ఖరీదు , కుక్క " అనే సినిమాలలో చిన్న చిన్న వేషాలతో కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత వందేమాతరం సినిమాతో మంచి బ్రేక్ అందుకున్నాడు . ఇవన్నీ కాదు సినిమా ఇండస్ట్రీలో పాతుకుపోవడానికి ఒకే ఒక్క సినిమా అంటూ ఆయనే స్వయంగా బయటపెట్టారు .
కోటా శ్రీనివాసరావు మాట్లాడుతూ.." నా కెరియర్ లో ఎన్నో సినిమాలు చేశాను . నా కెరియర్ లో కీలకమైన సినిమా మాత్రం "ప్రతిఘటన". ఇది నా కెరియర్ ని టర్న్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడింది . వందేమాతరం సినిమా చేస్తున్న టంలో టి కృష్ణ గారు నాకు ఈ సినిమా గురించి చెప్పాడు. మొదట కథ చెప్పినప్పుడు నాకు ఆ పాత్ర చిన్నదనిపించింది. పార్టీ అధ్యక్షుడిగా ఒక సన్నివేశం రాశాడు. సోదరీ సోదరీమణుల్లారా అని ప్రసంగించాల్సిన సీన్ అది. ఇక డైలాగ్ నా స్టైల్ లో తెలంగాణ యాసలో చెప్పేసరికి కృష్ణ గారికి బాగా నచ్చింది . అక్కడ ఉన్నవారు అక్కడ ఉన్న రచయిత పి ఎల్ నారాయణకు చెప్పి నా మీద అదే స్టైల్ లో మరో నాలుగైదు సీన్లు ఎక్స్ట్రాగా రాయమని చెప్పారు . రాత్రంతా కూర్చొని నా కోసమే 8 సన్నివేశాలు ప్రిపేర్ చేశారు . ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలేను . ఆ తర్వాత షూటింగ్ పూర్తయింది . సినిమా విడుదలైంది . ఈ సినిమా నాకు తెచ్చిన పేరు అందరికీ తెలిసిందే. నా లైఫ్ లో నేను మర్చిపోలేని సినిమా ఏంటి..? అంటే మాత్రం ప్రతిఘటననే చెబుతాను. ఓవర్ నైట్ లో నన్ను స్టార్ ని చేసిన సినిమా "ప్రతిఘటన". ఆ తర్వాత నేను నా కెరియర్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు "అంటూ చెప్పుకొచ్చారు
. నిజమే కోటా శ్రీనివాసరావు కెరియర్ లో ఎన్నో సినిమాలల్లో నటించిన ప్రతిఘటన సినిమా మాత్రం ఆయన కెరియర్ లో చాలా చాలా స్పెషల్. అందులో ఆయన పర్ఫామెన్స్ చాలా చాలా బాగుంటుంది.