
కోట శ్రీనివాసరావు లాంటి మహానియుడైన నటునితో కలిసి పని చేయడం పూర్వజన్మ సుకృతం అని చెప్పుకొచ్చారు. కోట శ్రీనివాసరావు లేకపోవడం టాలీవుడ్ ఇండస్ట్రీకి తీరని లోటు అని తారక్ చెప్పుకొచ్చారు. కోట శ్రీనివాసరావు కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని తారక్ అన్నారు. ఆయన ఎక్కడున్నా తన చల్లని చూపు మనందరిపై ఉండాలని ఆయన చెప్పుకొచ్చారు.
కోట శ్రీనివాసరావు గారు యాక్టింగ్ ఇండస్ట్రీకి నటనకు నిలువెత్తు రూపం అని తెలుగు ఇండస్ట్రీకి ఆయన ఒక్కరేనని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. మరో కోట పుట్టరు రారు అని తారక్ కామెంట్లు చేశారు. అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నానని తారక్ అన్నారు. ఆయన మనకు మిగిల్చి వెళ్లిన ఎన్నో అద్భుతమైన పాత్రలను, సినిమాలను ప్రేక్షకులు చూసి ఆస్వాదించాలని తారక్ చెప్పుకొచ్చారు.
కోట శ్రీనివాసరావు తన సినీ కేరీర్ లో 750కు పైగా సినిమాలలో నటించారు. ఈ సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి. కోట శ్రీనివాసరావు భౌతికంగా మరణించినా ఆయన చేసిన పాత్రల ద్వారా మాత్రం ఆయన జీవించి ఉన్నారని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు