ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ప్రతిష్టాత్మకమైన సినిమా "కన్నప్ప".  రీసెంట్ గానే రిలీజ్ అయి అభిమానులను ఆకట్టుకుంది.  విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది అని చెప్పాలి. కన్నప్ప సినిమా కోసం మంచు  విష్ణు ఎంతలా కష్టపడ్డాడు అన్నది సినిమా దగ్గర నుంచి చూసిన ప్రతి ఒక్కరికి బాగా తెలుసు . శివ భక్తుడైన కన్నప్ప కథగా వచ్చిన ఈ సినిమా జూన్ 27న థియేటర్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకుంది. టాక్ అయితే బాగానే పాజిటివిటీ ఎక్కువగా వచ్చిన కలెక్షన్స్ మాత్రం అనుకున్నంత స్థాయిలో రాబట్ట లేకపోయింది .


ఈ మూవీలో ప్రభాస్ తో పాటు మోహన్ బాబు ..మోహన్లాల్..  బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్..  కాజల్ అగర్వాల్ లాంటి అగ్రతారలంతా నటించారు.  సినిమాకి మంచి మంచి రివ్యూస్ వచ్చాయి.  మంచు విష్ణు నటనకి కూడా అందరూ ఫిదా అయిపోయారు . ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు . అంతేకాదు ఈ ప్రత్యేక ప్రదర్శన తెలుగు సినిమాకు గర్వకారణంగా నిలిచింది . మరీ ముఖ్యంగా ఈ స్పెషల్ షో కు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు అందరూ హాజరయ్యారు .



శివ భక్తుడైన భక్త కన్నప్ప చరిత్రను మరోసారి చూసి వారంతా మురిసిపోయారు.  సినిమాలో విష్ణు పర్ఫామెన్స్ కి ప్రభాస్ పెర్ఫార్మెన్స్ కి అందరు ఫిదా అయిపోయారు. ఈ సినిమా అనంతరం అద్భుతంగా ఉంది అంటూ పలువురు వాళ్ళ నటనను కొనియాడారు.   కన్నప్ప చిత్రంలో భావోద్వేగాలు అదేవిధంగా విజువల్ ఎఫెక్ట్స్ ఆధ్యాత్మిక భావనని బాగా చూపించారు అంటూ ప్రశంసించారు. ఈ స్పెషల్ షో పై చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది . భక్తి కథ  సాంస్కృతిక  ప్రాముఖ్య్యానికి దక్కిన ఈ గుర్తింపు అందరికీ గర్వకారణం అంటూ పేర్కొంది . మరీ ముఖ్యంగా అందరూ పెద్దలు మంచు విష్ణు నటనను కొనియాడారు . మంచు విష్ణు పర్ఫా మెన్స్ ఈ సినిమాలో బాగా ఎమోషనల్ గా ఉండింది అంటూ సినిమా రిలీజ్ అయిన టైంలో చాలామంది జనాలు పొగిడేశారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: