
అయితే శ్రీలీల పెళ్లి సందడి సినిమా కన్నా ముందే మరొక సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వాలి . ఆ సినిమా మరేంటో కాదు "చలో". నాగశౌర్య హీరోగా నటించిన ఈ సినిమా లో ముందుగా రష్మిక కన్నా కూడా శ్రీలీలనే అనుకున్నారట మూవీ మేకర్స్. కానీ శ్రీలీల అప్పుడు తనకు ఎగ్జామ్స్ ఉన్నాయి అంటూ ఈ ఆఫర్ రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత ఆ ఆఫర్ రష్మిక ఖాతాలో కి వెళ్ళింది . అలా రష్మిక మందన్నా.. తెలుగు ఇండస్ట్రీలో పాగా వేసి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటి సంపాదించుకుంది .
ఒకవేళ శ్రీలీల ఆ రోజు కాల్ షీట్స్ అడ్జస్ట్ చేసి ఛలో సినిమాలో నటించి ఉంటే ఇప్పుడు నేషనల్ క్రష్ గా అమ్మడు చెలరేగిపోయి ఉండేది . జస్ట్ మిస్. శ్రీలీల్ పెట్టిన సినీ పుణ్యమే ఇప్పుడు రష్మిక మందన్నా ఇంత పెద్ద స్టార్ అయ్యేలా చేసింది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. రష్మిక మందన్నా లో టాలెంట్ ఉంది కాబట్టి ఇంత పెద్ద స్టార్ అయింది . కానీ ఆమె ఎవరో ఆఫర్ ఇస్తే కాదు అంటూ ఘాటుగా రష్మిక అభిమానులు కూడా కౌంటర్ లు వేస్తున్నారు. కానీ ఈ ఇద్దరు మాత్రం చక్కగా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటారు . పుష్ప2 సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటించింది. శ్రీలీల స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది . స్పెషల్ పాట కోసం రష్మిక మందన్నానే శ్రీలీలను చూస్ చేసుకుంది అంటూ అప్పట్లో టాక్ వినిపించింది..!!