ఇప్పుడు హీరోయిన్స్ ఎలా ఉన్నారు అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎంట్రీ ఇచ్చిన మొదటి ఫిలిమ్ తోనే బోల్డ్ సీన్స్ .. కిస్ సీన్స్ చేస్తున్నారు . డైరెక్టర్ కొంచెం క్యారెక్టర్ డిమాండ్ చేస్తే చాలు ఏ సీన్స్ అయినా నటించడానికి రెడీ అంటున్నారు . అయితే ఒకప్పుడు హీరోయిన్స్ అలా కాదు కొంచెం కొంచెం రొమాంటిక్ సన్నివేశాలల్లో నటించాలి అన్నా.. పైట జార్చే  సీన్స్ లో నటించాలి అన్నా.. తెగ బాధ పడిపోయేవారు . అలాంటి లిస్టులోకే వస్తుంది హీరోయిన్ అనుష్క.  అనుష్క మొదటి నుంచి కూడా కొన్ని కొన్ని సీన్స్ ఇష్టం లేకుండానే చేసింది . ఇబ్బందికరంగానే చేసింది.  అందులో ఒక సినిమా "స్వాగతం".


జగపతిబాబుతో ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంది అనుష్క.  స్వాగతం సినిమా ఫీల్ కూడా ఎంటర్టైనర్ గా బాగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో భూమిక వన్ ఆఫ్ ద హీరోయిన్ క్యారెక్టర్ లో కనిపించి నటించి మెప్పించింది. కాగా ఈ సినిమాలో జగపతిబాబు అనుష్కల మధ్య "మనసా..? మౌనమా..? అనే ఒక సాంగ్ ఉంటుంది . ఇది చాలా చాలా రొమాంటిక్గా ఉంటుంది . ఒక అమ్మాయి తనలోని ఫీలింగ్ ని ఎలా బయటపెడుతుందో అనే విషయాన్ని డైరెక్టర్ ఈ పాట రూపంలో తెలియజేశాడు". ఈ పాటలో కొంచెం హద్దులు మీరీన సీన్స్ కూడా ఉంటాయి .



జగపతిబాబు - అనుష్క  ల మధ్య వచ్చే స్టెప్స్ రొమాంటిక్ గా ఉంటాయి . అయితే అనుష్క ఇంత రొమాంటిక్ కనిపించడం ఇదే ఫస్ట్.  చాలా ఇబ్బంది పడిందట షూటింగ్స్ స్పాట్లో ఈ సీన్స్ చేయడానికి . అంతేకాదు ఈ పాట లో మెడపై జగపతిబాబు  పదే పదే ముద్దు పెట్టాల్సి ఉంటుంది .. ఆ సీన్స్ అయిపోయాక అనుష్క ఇంటికి వెళ్లి సబ్బులు అరిగిపోయేలా రుద్దుకున్నిందట.  అప్పట్లో ఈ వార్త బాగా ట్రెండ్ అయ్యింది.  ఒక హీరోయిన్ ఇష్టం లేకుండా ఇలాంటి పాటలో నటించి అభిమానులను తన నటనతో ఆకట్టుకుంది అంటూ జనాలు బాగా ఆమె గురించి మాట్లాడుకున్నారు.  ఆ తర్వాత మెల్లిగా అనుష్క కూడా ఇలాంటి సీన్స్ చేయడానికి అలవాటు పడింది . కానీ ఎక్కడా కూడా తన లిమిట్స్ మాత్రం క్రాస్ చేయలేదు. అనుష్క సినిమాలకు బ్రేక్ ఇచ్చిన సరే రీ ఎంట్రీ తర్వాత అలాంటి క్రేజీ హిట్  తన ఖాతాలో వేసుకుంటుంది అంటే అభిమానులు లకి ఆమె ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు . త్వరలోనే అనుష్క "ఘాటి" అనే సినిమాతో అభిమానులను పలకరించబోతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: