
ఇకపోతే ఈ చిత్రం కోసం విజయ్ చాలా హార్డ్ వర్క్ చేశాడు. మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నాడు. ఫిజికల్ గా మరియు మెంటల్‌గా తన శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించాడు. అయితే కింగ్‌డమ్ మూవీ కోసం విజయ్ దేవరకొండ ఒక డేంజరస్ స్టంట్ చేశాడంటూ నెట్టింట ఓ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి రెండు గోడల మధ్య చేతుల సహాయం లేకుండా కాళ్ల సపోర్ట్ తోనే 12 అడుగులు పైకి ఎక్కడం కనిపిస్తుంది.
సదరు వ్యక్తి గుబురు గడ్డం, క్యాప్ పెట్టుకోవడంతో సైడ్ నుంచి అచ్చం విజయ్ దేవరకొండ మాదిరిగానే ఉన్నాడు. దాంతో విజయ్‌నే ఆ స్టంట్ చేశాడంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అది గుడ్డిగా నమ్మిన అభిమానులు మరియు సినీప్రియులు విజయ్ పై ప్రశంసలు కురిపించారు. ఆయన హార్డ్ వర్క్ ను తెగ మెచ్చుకుంటున్నారు. కానీ ట్విస్ట్ ఏంటంటే అసలు ఆ వీడియోలో ఉన్నది విజయ్ దేవరకొండ కాదు. ఏపీ ఫ్లిప్పర్ అనే యూట్యూబ్ ఛానెల్ లో ఒక వ్యక్తి పోస్ట్ చేసిన వీడియో అది. ఈ విషయం కొంచెం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పిచ్చోళ్లమైయ్యమని ఫ్యాన్స్, పోయాం మోసం అంటూ మూవీ లవర్స్ ఫీల్ అవుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు