ఓర్మాక్స్ సంస్థ ప్రతినెలా కూడా ఇండియాలో మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఈసారి జూన్ నెలలకు సంబంధించి లిస్టును విడుదల చేయగా ఈ లిస్టులో హీరో ప్రభాస్ టాప్ లిస్టులో ఉండగా ఆ తర్వాత తమిళ నటుడు విజయ్ దళపతి, పుష్ప సినిమాతో భారీ క్రేజ్ సంపాదించుకున్న అల్లు అర్జున్ మూడవ స్థానంలో నిలిచారు. నాలుగవ స్థానంలో షారుక్ ఖాన్ ఉండగా.. ఐదవ స్థానంలో అజిత్ కుమార్,SSMB 29 తో ఆరవ స్థానంలో మహేష్ బాబు, వార్ 2 చిత్రంతో ఏడవ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్, పెద్ది సినిమాతో ఎనిమిదవ స్థానంలో రామ్ చరణ్, తొమ్మిదవ స్థానంలో అక్షయ్ కుమార్, పదో స్థానంలో హీరో నాని ఉన్నారు.


హీరోయిన్స్ విషయానికి వస్తే మరొకసారి టాలీవుడ్ హీరోయిన్ సమంత మొదటి స్థానం.. రెండవ స్థానం ఆలియా భట్, మూడవ స్థానం దీపికా పదుకొనే, నాలుగవ స్థానంలో త్రిష, ఐదవ స్థానంలో కాజల్ అగర్వాల్, ఆరో ప్లేస్ లో సాయి పల్లవి, ఏడవ ప్లేసులో నయనతార, ఎనిమిదవ ప్లేసులో రష్మిక, 9వ ప్లేస్ లో కీర్తి సురేష్, పదవ ప్లేసులో తమన్నా .. అయితే పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలలో నటించిన రష్మిక ఎనిమిదవ స్థానం రావడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.. అయితే ఈసారి స్టార్స్ జాబితాలో శ్రీలీల కనిపించకపోవడం గమనార్హం.


మొత్తానికి ఇందుకు సంబంధించి న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ గా మాట్లాడడంతో అభిమానులు ఖుషి అవుతుండగా మరి కొంతమంది అభిమానులు నిరాశతో ఉన్నారు. అయితే సెలబ్రెటీల స్థానాలు ప్రతినెలా కూడా మారుతూ ఉంటాయి. మరి ఈ నెలలో స్థానం సంపాదించని స్టార్ నటీనటుల సైతం మరి వచ్చే నెల అయిన స్థానాన్ని సంపాదిస్తారేమో చూడాలి మరి. ఇందుకు సంబంధించి ట్విట్ వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: