ఈ మధ్యకాలంలో విడాకుల వార్తలు ఒక్కటైనా వినిపించలేదే అని అనుకునే లోపే మరో హీరోయిన్ విడాకులు తీసుకోబోతుంది అంటూ ఒక వార్త ఇండస్ట్రీలో సంచలనం రేపుతుంది.. సౌత్ నార్త్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా అవకాశాలు రావడం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని ఏలిన వాళ్లలో హన్సిక మోత్వాని కూడా ఉండేది. అలా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హన్సిక ఆ తర్వాత అల్లు అర్జున్ దేశముదురు మూవీ తో హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. ఇక దేశముదురు సినిమా చేస్తున్న సమయంలో హన్సిక ఏజ్ చాలా తక్కువ.. అయినా కూడా హీరోయిన్ గా ఇరగదేసింది. 

ఆ తర్వాత హన్సికకు చాలా అవకాశాలు వచ్చాయి.ఇక కాస్త బొద్దుగా ఉండే కారణంతో హన్సికకు కొన్ని అవకాశాలు చేజారినప్పటికీ ఆ తర్వాత సన్నగా మెరుపుతీగలా మారిపోయింది. అలాగే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే సోహైల్ ఖతూరియాని పెళ్లి చేసుకుంది.ఈమె పెళ్లి సమయంలో పెద్ద రచ్చనే జరిగింది. ఎందుకంటే సోహెల్ ఖతూరియా రెండో పెళ్లి వాడు.. అంతే కాకుండా సోహైల్ కతూరియా హన్సిక క్లోజ్ ఫ్రెండ్ భర్త.. వీరి పెళ్లిలో హన్సిక సందడి చేసిన వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. హన్సిక ఫ్రెండ్ ని పెళ్లి చేసుకున్న సోహైల్ ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి హన్సిక పెళ్లాడారు.ఇక వారి విడాకులకు కారణం హన్సికనే అని అంటూ ఉంటారు.

హన్సిక స్నేహితురాలి కాపురంలో చిచ్చు పెట్టింది అని చాలామంది మాట్లాడుకున్నారు. అలా చివరికి 2022లో పెళ్లి బంధంతో ఒక్కటైన హన్సిక సోహైల్ గత  సంవత్సర కాలం నుండి దూరం దూరంగా ఉంటున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు హన్సిక సోహైల్ ఖతూరియా విడాకులు తీసుకోబోతున్నట్టు బాలీవుడ్ లోని ప్రముఖ మీడియాలో వార్తలు రావడంతో చాలామంది నెటిజన్లు ఇండస్ట్రీలో మరో హీరోయిన్ విడాకులు అంటూ మాట్లాడుకుంటున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోహైల్ ఖతూరియాకి ఈ విడాకుల వార్తలపై ప్రశ్న ఎదురవ్వగా అలాంటిదేమీ లేదు. మేము విడాకులు తీసుకోవడం లేదు అని కొట్టి పారేశారు.

కానీ చాలా మంది మాత్రం గత సంవత్సరకాలం నుండి హన్సిక భర్తతో అంటీ ముట్టనట్లుగానే ప్రవర్తిస్తుంది. అలాగే పుట్టింట్లోనే ఉంటుంది. వీరి విడాకులు రూమర్లు నిజమే అని మాట్లాడుకుంటున్నారు. అయితే హన్సిక సోహైల్ మధ్య ఓ హీరో చిచ్చు పెట్టాడని, పెళ్ళయ్యాక కూడా హన్సిక ఆ హీరోతో క్లోజ్ గా ఉండడం వల్లే సోహైల్ అదంతా భరించలేక తరచు హన్సికతో గొడవలు పెట్టుకోవడం వల్ల వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చి చివరికి హన్సిక సోహైల్ తో విడాకులు తీసుకోవడానికి రెడీ అయినట్టు రూమర్ బీటౌన్ లో గట్టిగా వినిపిస్తోంది.మరి హన్సిక కాపురంలో చిచ్చు పెట్టిన హీరో ఎవరో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: