
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో, నిధి అగర్వాల్ హీరోయిన్‌గా, క్రిష్ - ఏఎం. జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక సినిమా హరిహర వీరమల్లు. ఎన్నో వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఈ నెల 24న థియేటర్లకు రానుంది. గత ఐదేళ్లుగా షూటింగ్, కోవిడ్, రాజకీయ వివాదాలు, ఇతర కార్యక్రమాల కారణంగా వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుండడంతో అంచనాలు స్కై రేంజ్ లో ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలకు విడుదల సమయాల్లో తలెత్తే సమస్యలు ఈ సినిమాను కూడా వదల్లేదు. నైజాం ప్రాంతంలో విడుదలకు ముందు ఒక సమస్య తలెత్తింది. ఈ సినిమా నిర్మాత ఏ.ఎం. రత్నం గత సినిమా బకాయిలు చెల్లించాల్సిందిగా డిస్ట్రిబ్యూటర్లు ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించినట్టు సమాచారం. ఈ అంశం ఒకింత కలకలం రేపగా, నైజాంలో విడుదలపై సందిగ్ధత ఏర్పడింది. పవన్ కళ్యాణ్‌కి ఈ ప్రాంతంలో ఉన్న ఫ్యాన్ బేస్, ఓపెనింగ్ కలెక్షన్లను దృష్టిలో పెట్టుకుంటే, ఇది పెద్ద ఇబ్బందిగా మారుతుందా ? అన్న సందేహాలు కలిగాయి.
ఈ పరిస్థితుల్లో రంగంలోకి దిగిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ నైజాం ప్రాంతంలో హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చింది. మైత్రి సంస్థకు ఉన్న మార్కెట్ నెట్‌వర్క్, మేనేజ్‌మెంట్ అనుభవంతో ఇప్పుడు నైజాంలో ఈ సినిమా రిలీజ్‌కు ముందున్న సమస్యలు క్లీయర్ కావడంతో పాటు పెద్ద సంఖ్యలో థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో ట్రేడ్ వర్గాలు కూడా ఊపిరి పీల్చుకున్నాయి. పవన్ సినిమాలకు మొదటి రోజు నుంచే భారీ ఓపెనింగ్స్ వస్తాయి. ముఖ్యంగా నైజాంలోని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు