కోలీవుడ్, టాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరుపొందిన అజిత్ క్రేజీ గురించి తెలియజేయాల్సిన పనిలేదు.. ఈ ఏడాది మాత్రం వరుసగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అభిమానులను అలరించారు. విడాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి చిత్రాలతో అలరించిన అజిత్ అలాగే షూటింగ్ సమయాల్లో కొంత గ్యాప్ దొరకగానే తనకు ఇష్టమైన కార్ రేసింగ్ లో పాల్గొంటూ ఉంటారు. హీరో అజిత్ నెక్స్ట్ ప్రాజెక్ట్ అక్టోబర్లో మొదలు కాబోతోంది. రాబోయే చిత్రాన్ని డైరెక్టర్ అధిక్ రవిచంద్ర డైరెక్షన్ వహిస్తున్నారు.


తాజాగా ఇటీవలే జరిగిన కార్ రేసింగ్లో హీరో అజిత్ కి మరొకసారి ప్రమాదం జరిగినట్లుగా వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఇటలీలో జరిగిన GT 4 యూరోపియన్ రేస్ లో అజిత్ పాల్గొన్నారు.. అయితే ఈ రేసులో ముందు ఉన్న కారు అకస్మాత్తుగా ట్రాక్ కు అడ్డంగా పడిపోవడంతో హీరో అజిత్ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అజిత్ కారు ఎడమ ముందు భాగం దెబ్బతిన్నట్లుగా కనిపిస్తోంది. హీరో అజిత్ కు మాత్రం ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.



అయితే ఈ వీడియోలో వైరల్ గా మారుతున్న ప్రకారం అజిత్ తన కారు నుంచి నడుస్తూ కనిపించారు. ఈ ప్రమాదానికి జరిగిన సంఘటనలో హీరో అజిత్ డ్యామేజ్ అయిన భాగాలను తీసివేస్తూ కనిపించారు. ఈ వీడియో చూసిన తర్వాత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో రెండు సార్లు ఇలాంటి ప్రమాదానికి గురైన అజిత్ ఇప్పుడు మూడవసారి కావడం గమనార్హం. 1990లో మొదటిసారిగా చైల్డ్ యాక్టర్ గా మొదలుపెట్టిన అజిత్ ఆ తర్వాత అమరావతి అనే చిత్రంలో హీరోగా నటించారు. ఆ తర్వాత ప్రేమ పుస్తకం అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అలా ఎన్నో చిత్రాలలో నటించి స్టార్ హీరోగా పేరు సంపాదించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: