"పవన్ కళ్యాణ్".. ఎప్పుడెప్పుడు స్టేజ్ ఎక్కుతాడు ..? ఎప్పుడెప్పుడు మైక్ పట్టుకొని మాట్లాడుతాడు..?  అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని వెయిట్ చేసే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలామంది ఉంటారు . వాళ్లకి స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది హరిహర వీరమల్లు మూవీ టీం. ఎవరు ఊహించని విధంగా అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేని విధంగా హరిహర వీరమల్లు సినిమా టీం ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది . పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ మరి కొద్ది గంటల్లోనే జరగబోతుంది అయితే సడన్ గా ఉన్న పలంగా హరిహర వీరమల్లు సినిమా మూవీ టీం ప్రెస్ మీట్ నిర్వహించింది .


హైలెట్ ఏంటంటే ఈ ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వడమే . పవన్ కళ్యాణ్ ఫుల్ బిజీ బిజీ. ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన తన వర్క్ షెడ్యూల్ ఎంత పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు అనేది అందరికీ తెలుసు.  అలాంటి పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ మీటింగ్స్ ని .. పొలిటికల్ వర్క్ ని పక్కన పెట్టేసి మరి హరిహర వీరమల్లు సినిమా కోసం ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు . ఆయన స్పీచ్ కూడా హైలేట్ గా మారింది. "నాకు ఇది చాలా కొత్తగా ఉంది . పోడియం లేకుండా మాట్లాడుతుంటే ఏదో నగ్నంగా ఉంది. పొలిటికల్ ఎంట్రీ తర్వాత పోడియం లేకుండా మాట్లాడడం కొత్తగా  ఉంది అంటూ నవ్వేశారు".



అంతేకాదు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.." నా కెరియర్ లో ఫస్ట్ టైం ఓ  సినిమా కోసం ప్రెస్ మీట్ పెట్టాను . అంతకుముందు పొలిటికల్ పరంగా ఎన్నో ప్రెస్ మీట్ లు నిర్వహించాను.  కానీ సినిమాకు సంబంధించి ఇదే ఫస్ట్ ప్రెస్ మీట్ . నాకు అసలు ఇష్టం లేదు . ఎప్పుడు కూడా నేను ఇంత చేశాను అంత చేశాను అని చెప్పుకోను . నా వర్క్ .. నా శ్రమ .. ఇదే అనుకుంటాను . అయితే హరిహర వీరమల్లు సినిమా విషయంలో మాత్రం అంతకుమించి . ఆ కారణంగానే ఈ ప్రెస్ మీట్.  మరీ ముఖ్యంగా ఏఎం రత్నం గారి రిక్వెస్ట్ చేయడం కారణంగానే ఈ ప్రెస్ మీట్ పెట్టాము" అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానం ..ఆయన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. హరిహర వీరమల సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఇంత రిస్క్ చేస్తున్నాడు ఏంటి? అంటూ కూడా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు . ఈ సినిమా హిట్ అవ్వడం పవన్ కళ్యాణ్ కి చాలా ఇంపార్టెంట్ అని.. ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టిన నిర్మాతలు నష్టపోకుండా పవన్ కళ్యాణ్ తన వంతు సహాయం చేస్తున్నారని అంతా మాట్లాడుతున్నారు. చూదాలి మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో...??

మరింత సమాచారం తెలుసుకోండి: