ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన రేంజ్ లో ప్రేక్షకాదరణ పొందిన సినిమాలలో అవతార్ సినిమా ఒకటి. జేమ్స్ కెమెరాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మొదటి భాగం ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీ లోని గ్రాఫిక్స్ కు ప్రపంచ వ్యాప్తంగా జనాలు ఫిదా అయ్యారు. ఇలా అవతార్ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించిన తర్వాత అవతార్ రెండవ భాగం విడుదల కావడానికి అత్యంత ఎక్కువ సమయం పట్టింది. కొంత కాలం క్రితమే అవతార్ మూవీ రెండవ భాగం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మూవీ కూడా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకుంది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే అవతార్ మూడవ భాగం కూడా మరికొన్ని రోజుల్లో రానుంది. అవతార్ మూడవ భాగం అవతార్ ఫైర్ అండ్ యాశ్ అనే టైటిల్తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ట్రైలర్ విడుదలకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ను అవతార్ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఈ వారంలో విడుదల కానున్న హాలీవుడ్ మూవీ అయినటువంటి ది ఫెంటాస్టిక్ ఫోర్  : ఫస్ట్ స్టెప్స్ మూవీ తో పాటు అవతార్ ఫైర్ అండ్ యాశ్ మూవీ ట్రైలర్ను వీక్షించవచ్చు అని ఈ మూవీ బృందం సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేసింది. ఈ సంవత్సరం డిసెంబర్ 19 వ తేదీన అవతార్ ఫైర్ అండ్ యాశ్ మూవీ ని థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: