ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రెటీస్ విడాకులు అన్న పదానికి చాలా చాలా దూరంగా ఉంటూ వచ్చారు. గతంలో మాత్రం స్టార్ సెలబ్రెటీస్ హీరో - హీరోయిన్స్ - డైరెక్టర్  ఇలా చాలామంది ప్రేమించి  పెళ్లి చేసుకుని లైఫ్ ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అని అనుకునేలోపే  వాళ్ల మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు . మరి ముఖ్యంగా ఒకానొక టైం లో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఎక్కువగా విడాకులు తీసుకుంటూ వచ్చారు.  కరెక్ట్ గా ఆరు నెలల వ్యవధిలోనే దాదాపు 12 సెలబ్రిటీస్ విడాకులు తీసుకున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండిది అనేది అర్థం చేసుకోవచ్చు.
 

కాగా ఈ మధ్యకాలంలో మాత్రం విడాకులు అన్న పదానికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక స్టార్ సెలబ్రిటీ విడాకులు తీసుకోబోతున్నాడు అన్న వార్త సంచలనంగా మారింది . అది కూడా తెలుగు ఇండస్ట్రీలో ఉండే ఒక యంగ్ హీరో . అసలు కాంట్రివర్షియల్ అన్న పదానికి చాలా చాలా దూరంగా ఉండే ఈ యంగ్ హీరో తన చేతికి వచ్చిన సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ వస్తున్నాడు. కాగా పెళ్లి చేసుకుని రెండేళ్ల అవుతుంది. ఇప్పటివరకు గుడ్ న్యూస్ అందించలేదు . ఎందుకు గుడ్ న్యూస్ అందించలేదా..? అంటూ సోషల్ మీడియాలో జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటూనే వచ్చారు . అయితే మొదటి నుంచి ఈ హీరో పెళ్లి పై రకరకాల రూమర్స్ వినిపిస్తూనే వచ్చాయి .



ఆ హీరోకి అసలు ఆ అమ్మాయి సూట్ అవ్వలేదు అంటూ పెళ్లి టైం లో వాళ్ళ ఫొటోస్ ట్రెండ్ అయినప్పుడు చాలామంది కామెంట్స్ చేశారు . పెళ్ళి అయ్యి రెండేళ్ల అవుతున్న గుడ్ న్యూస్ వినిపించకపోయేసరికి ఏదో తేడా కొడుతుంది అని  కూడా అంతా మాట్లాడుకున్నారు . అయితే సడన్గా వీళ్లు విడాకులు తీసుకోబోతున్నారు అన్న ప్రచారం తెర పైకి వచ్చింది.  దానికి కారణం వాళ్ళు దూరం దూరంగానే ఉంటూ ఉండటం . ఈ మధ్యకాలంలో ఈ హీరో సినిమాల కి సైన్ చేయడం లేదు . చిన్న డైరెక్టర్స్ వెళ్లి అవకాశాలు ఇస్తున్న కూడా ఇంట్రెస్ట్ లేదు అంటూ రిజెక్ట్ చేస్తున్నారట .



ఎందుకా..?? అని డీప్ గా ఆరా తీయగా.. ఆ హీరో తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నాడు అని ..ప్రజెంట్ వాళ్ళు దూరం గా ఉన్నారని .. ఫ్యామిలీ ఇష్యూస్ కారణంగానే సినిమాలకు దూరమయ్యాడు అని .. ఓ న్యూస్ తెరపైకి వచ్చింది . దీంతో అభిమానులు జనాలు షాక్ అయిపోతున్నారు. ఇంత మంచి హీరోకి ఏం ప్రాబ్లం వచ్చింది ..?? ఎందుకు విడాకులు తీసుకుంటున్నాడు..? అంటూ మాట్లాడుకుంటున్నారు . ఈ వార్తలో ఎంత నిజం ఉంది అని తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం తెగ చక్కర్లు కొడుతుంది. ఇది నిజం కాకూడదు అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. దీనిపై పూర్తి క్లారిటీ రావాలి అంటే ఆ హీరో స్పందిస్తేనే బాగుంటుంది అంటున్నారు అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: