తరచూ ఈ మధ్య ఎక్కువగా నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించే సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తోంది. అలా ఇప్పుడు తాజాగా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించి సినిమా రాబోతున్నట్లు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా తీయాలని చూస్తున్నది ఎవరో కాదు హీరో అమీర్ ఖాన్. మరి ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి చూద్దాం.


అమీర్ ఖాన్  ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు.. కానీ ఆ సినిమాలు ఏవి కూడా సంతృప్తికర ఫలితాలను ఇచ్చినట్లుగా కనిపించడం లేదు. లాల్ సింగ్ చడ్డా సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఆ తర్వాత విడుదలైన సితారే జమీన్ పర్ అనే సినిమా వచ్చినా కూడా టాక్ బాగున్న కలెక్షన్స్ యావరేజ్ గానే నిలిచాయి. అందుకే ఇలాంటి సమయంలోనే తనకి సంతృప్తినిచ్చే ఏదైనా సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని కొట్టాలని ముందుకు సాగుతున్నారు. ఈసారి నిజ జీవిత కథను ఎంపిక చేసుకున్నట్లు బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది.


ఇటీవలే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హనీమూన్ హత్య కేసు ఈ కేసులో చాలా ట్విస్టులు, టర్నింగ్ పాయింట్ ఉండడంతో అమీర్ ఖాన్ చాలా విపరీతంగా ఆకట్టుకున్నాయట.. రాజా రఘువంశి మరణం వెనక అతని భార్య సోనమ్ కుట్ర చేసిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరపై  ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నట్లు బాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అమీర్ ఖాన్ కూడా చాలా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కానీ ఈ విషయానికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన అయితే వెలుపడలేదు.. అమీర్ ఖాన్ తలాష్ అనే ఒక క్రైమ్ థ్రిల్లర్ ని గతంలో తెరకెక్కించారు. ఇది కూడా నిజ జీవిత సంఘటన ఆధారంగానే తెరకెక్కించారు. ఇప్పుడు కూడా  అలానే చేయబోతున్నట్లు సమాచారం. అలాగే మహాభారతం తన డ్రీమ్ ప్రాజెక్టును కూడా చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: