సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వార్తలు ట్రెండ్ అవుతూ ఉంటాయి. వైరల్ అవుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన కొన్ని కొన్ని వార్తలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి . అలా వైరల్ అయ్యే ప్రతి వార్త నిజం అని చెప్పలేం . అయితే అలా వైరల్ అయ్యే ప్రతి వార్త అబద్దం అని కూడా కొట్టి పడేయలేము.  ఎందుకంటే చాలా మంది స్టార్ సెలబ్రిటీల లైఫ్ లో ఏం జరుగుతుంది..? ఏం జరగబోతుంది..? అనే విషయాలను సోషల్ మీడియా ఎప్పటికప్పుడు బయట పెట్టేస్తూనే వస్తుంది . దానికి బిగ్ బిగ్ ఎగ్జాంపుల్ నాగచైతన్య - సమంతల విడాకులు .


నాగచైతన్య - సమంత విడాకులు తీసుకోబోతున్నారు అని వాళ్ళ మధ్య ఏదో ఇష్యూస్ నడుస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో వాళ్ళు విడాకులు ప్రకటన చేయక ముందే వార్తలు వినిపించాయి . దాదాపు 6 నెలల ముందు నుంచి సమంత - చైతన్య  విడాకులు  తీసుకోబోతున్నారు అన్న ప్రచారం జరిగింది. మీడియాలో వార్తలు వినిపిస్తున్న మూమెంట్లోనే " మేం విడిపోతున్నాం " అంటూ అధికారికంగా ప్రకటించేశారు నాగచైతన్య - సమంత . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో మరొక వార్త హాట్ టాపిక్  హా ట్రెండ్ అవుతుంది. మెగా హీరోస్ కి మెగాస్టార్ చిరంజీవి ఒక డైరెక్టర్ తో సినిమాని చేయనే చేయొద్దు అంటూ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇచ్చారట . ఆయన మరెవరో కాదు "కొరటాల శివ".



సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.." ఆచార్య సినిమా డిజాస్టర్ తర్వాత కొరటాల శివ బిహేవియర్ మెగా ఫ్యామిలీకి అస్సలు నచ్చలేదట . అందరికీ కూడా ఆచార్య సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అదేవిధంగా రామ్ చరణ్ తాను అనుకున్న కథను సీన్స్ మారుస్తూ వాళ్లకు నచ్చినట్లు డైరెక్ట్ చేసుకోవడమే అంటూ చెప్పుకు వచ్చారట . ఆ కారణంగానే మెగా హీరోస్ ఎవరు కూడా కొరటాల శివకు ఛాన్స్ ఇవ్వకూడదు అనే కండిషన్ పెట్టాడట చిరంజీవి ". ఇది నిజంగా చిరంజీవి పెట్టాడు అన్నదానిపై అసలు క్లారిటీ లేదు .



ఎవరు కూడా దీనిపై అఫీషియల్ గా స్పందించింది లేదు . కానీ కొంతమంది ఆకతాయిలు మాత్రం సోషల్ మీడియాలో దీన్ని తెగ ట్రెండ్ చేశారు.  చిరంజీవి ఆ మాటలు అనకపోయినా కూడా చిరంజీవి క్యారెక్టర్ అలాంటిదే అంటూ ఆయన పేరు గబ్బు పట్టించడానికి ట్రై చేశారు . కానీ మెగా అభిమానులు మాత్రం ఆ ట్రోలింగ్ ని తిప్పి కొట్టారు.  చిరంజీవి మీద ఈగ కూడా వాళ్ళనివ్వకుండా చూసుకుంటారు మెగా అభిమానులు అలాంటిది ఇంత పెద్ద తప్పుడు నింద వేస్తూ ఉంటే ఊరుకుంటారా ఎక్కడికక్కడ.. ఎప్పటికప్పుడు .. ఎవరికి వాళ్ళకి రప్ఫాడించే  రేంజ్ లో ఇచ్చి పడేసారు . ఇదంతా ఫేక్ అంటూ ఎప్పటికప్పుడు కొట్టి పడేశారు . ప్రజెంట్ కొరటాల శివ - ఎన్టీఆర్ తో దేవర 2 ను సెట్స్ పైకి  తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: