వివాహం అనంతరం ఫహద్, నజ్రియా తమ బాండ్ ను మరింత బలపరుచుకున్నారు. ఎలాంటి మనస్పర్థలు లేకుండా అన్యోన్యంగా జీవిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచారు. అయితే ఏమైందో ఏమో కానీ.. ఇటీవల నజ్రియా సోషల్ మీడియా మరియు ఇతర కార్యక్రమాలకు సడెన్‌గా దూరమైంది. బయట కూడా కనిపించడం మానేసింది. ఇందుకు గల కారణాన్ని వివరిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ లో నజ్రియా ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టింది.
కొద్ది రోజుల నుంచి తాను మానసికంగా పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని.. ఎవరితోనూ మాట్లాడాలనిపించలేదని నజ్రియా పేర్కొంది. డిప్రెషన్ కారణంగా తన 30వ పుట్టినరోజు వేడుకలు, న్యూ ఇయర్ వేడుకలు, చివరకు తన మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ తో సహా ఎన్నో ముఖ్యమైన క్షణాలను మిస్ అయ్యానని నజ్రియా ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ఆమె పోస్ట్ తో ఒక్కసారిగా విడాకుల వార్తలు గుప్పుమన్నారు. ఫహద్ తో విభేదాలు తలెత్తడం వల్లే నజ్రియా డిప్రెషన్ కు లోనైందని.. త్వరలో ఈ జంట కూడా విడాకుల బాటలో నడవబోతున్నారని వార్తలు వైరల్ అయ్యాయి.కానీ ఫహద్, నజ్రియా మాత్రం నోరు విప్పలేదు. అయితే తాజాగా పరోక్షంగా విడాకుల వార్తలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ జంట కలిసి కనిపించారు. మలయాళ స్టార్ మోహన్ లాల్ ఇంట ఓ రీయూనియన్ జరిగింది. ఈ వేడుకలో ఫహద్, నజ్రియా జంట సందడి చేశారు. నవ్వులు చిందిస్తూ ఎప్పటిలాగానే క్లోజ్‌గా కనిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు బయటకు రావడంతో విడాకుల వార్తలకు పులిస్టాప్ పడినట్లు అయింది. మరోవైపు ఫ్యాన్స్ కూడా ఫహద్ - నజ్రియా జంటను చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి