
ఈ భారీ బడ్జెట్ అడ్వెంచర్ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే మొదలైంది. ప్రస్తుతం కెన్యాలో జరగాల్సిన షూటింగ్ ఇతర కారణాల ఇతర దేశాల్లో జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. మొదట రెండు భాగాలుగా విడుదల చేయాలని భావించినప్పటికీ, ఇప్పుడు రాజమౌళి దీన్ని ఒకే భాగంగా తీయాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.
ఈ సినిమా నిర్మాణం భారీ స్థాయిలో జరుగుతోంది. అయినప్పటికీ, అధికారిక ప్రకటన వెలువడే వరకు విడుదల తేదీపై ఎలాంటి నిర్ధారణ లేదు. అభిమానులు మాత్రం ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను దాదాపు రూ. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఇది ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రాలలో ఒకటిగా నిలవనుంది.
రాజమౌళి RRRతో గ్లోబల్ ఫేమ్ సాధించిన తర్వాత, SSMB29ని పాన్-వరల్డ్ మూవీగా ప్లాన్ చేస్తున్నారు. ఇది హాలీవుడ్ స్థాయిలో నిర్మించబడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సాహస వీరుడి పాత్రలో కనిపించనున్నారు. మహేష్ రాజమౌళి కాంబో సినిమా డిజిటల్ హక్కులు ఊహించని మొత్తానికి అమ్ముడయ్యే ఛాన్స్ అయితే ఉంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమా కోసం 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నారని సమాచారం అందుతోంది.