సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది . కానీ అందరిలోకి చాలా డిఫరెంట్ గా ఉండే ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారు అంటే మాత్రం ఖచ్చితంగా అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అని చెప్పుకోక తప్పదు . పవన్ కళ్యాణ్ కేవలం హీరోగా కాదు ఒక అన్నలా ఇంటికి పెద్దదిక్కుల భావిస్తుంటారు. ఇంకొంతమంది ఏకంగా దైవంలా భావిస్తూ ఉంటారు . ఆ విషయం అందరికీ తెలిసిందే . మరికొద్ది గంటల్లోనే "హరి హర విరమల్లు" సినిమా రిలీజ్ కాబోతుంది .పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది నిజంగా ఒక బిగ్ పండగ లాంటి రోజే అని చెప్పాలి .

దాదాపు 5 ఏళ్లకు పైగా సెట్స్  పై ఉన్న ఈ సినిమా రిలీజ్ కి నోచుకోవడం తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు . అంతే కాదు పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమా కోసం ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు.  ఏపీ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత పవన్ కళ్యాణ్ బిజీ షెడ్యూల్స్ అందరికీ తెలిసినవే.  ఆయన బిజీ షెడ్యూల్స్ లో కూడా హరిహర వీరమల్లుకి టైం కేటాయించారు . మరి ముఖ్యంగా  పలు ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతూ పవన్ కళ్యాణ్ సినిమాకి మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు . అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక డైలాగ్ బాగా ట్రెండ్ అవుతుంది .

మరికొద్ది గంటల్లో హరిహర వీరమల్లు సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతుంది అన్న మూమెంట్లో పర్ఫెక్ట్ టైమింగ్ లో పర్ఫెక్ట్ డైలాగ్ ని  ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . గోపాల గోపాల సినిమాలో వెంకటేష్ ని ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ ఒక డైలాగ్ చెప్తాడు . "కొన్నిసార్లు రావడం లేట్ కావచ్చు కానీ రావడం మాత్రం పక్క " అంటూ..ఆ డైలాగ్ బాగా ట్రెండ్ అయ్యింది.  కానీ ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాకి అది చాలా పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ డైలాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు.

చాలామంది ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకి గుడ్ బై చెప్పబోతున్నాడు అని మాట్లాడుకున్నారు.  హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయినట్లే అంటూ ప్రచారం చేశారు . కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక పక్క తన బాధ్యతలను కొనసాగిస్తూనే మరొక పక్క మేకర్స్ కి ఇచ్చిన ప్రామిస్ నిలబెట్టుకున్నారు.  సినిమా షెడ్యూల్ ని చక్కగా ముందుకు తీసుకెళ్లి థియేటర్స్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశారు . కేవలం కొద్ది గంటలే మరికొద్ది గంటల్లోనే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ మూమెంట్ ని పండగల సెలబ్రేట్ చేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్.  ఇప్పటికే థియేటర్స్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా ఓ రేంజ్ లో ఉందని చెప్పాలి . అంతేకాదు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి . "అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి" సినిమా స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడు..?? ఇప్పుడు ఎలా ఉన్నాడు..?? అనేది వీడియో రూపంలో చేసి ఓ రేంజ్ లో  ట్రెండ్ చేస్తున్నారు..!!
 

మరింత సమాచారం తెలుసుకోండి: