
కథ :
రాక్షసరాజు హిరణ్యకశిపుడు బ్రహ్మ దేవుని నుంచి మీరు సృష్టించిన ఏ జీవి వల్ల ఎలాంటి కాలంలో కూడా ఏ అస్త్రశస్త్రాల నుంచి తన ప్రాణాలకు ముప్పు కలగకూడదని వరం పొందుతాడు. ఆ తర్వాత హిరణ్యకశిపుడు తానే భగవంతునినని ప్రకటించుకోవడంతో పాటు ముల్లోకాలను తానే అధిపతినని చెబుతూ భూలోకంలో ధర్మాన్ని కాలరాస్తాడు. మహావిష్ణువు తన సోదరుడి మరణానికి కారణం కావడంతో పగతో రగిలిపోతూ ఉంటాడు.
అయితే తన కొడుకు ప్రహ్లాదుడు విష్ణువుకు భక్తుడిగా మారడంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపడానికి ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాలను విష్ణువు ఎలా ఆపాడు? విష్ణువు నరసింహావతారం ఎత్తడానికి కారణాలేంటి? హిరణ్యకశిపుడి సంహారం ఎలా జరిగింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
విశ్లేషణ:
నాలుగు దశాబ్దాల క్రితం వెండితెరపై పురాణాలకు సంబంధించిన సినిమాలు ఎక్కువగా తెరకెక్కాయి. అయితే ఆ తర్వాత కాలంలో సినిమాలకు సంబంధించి ఎక్కువ సినిమాలు తెరకెక్కుతాయి. హిరణ్యకశిపుడి కథాంశంతో సినిమాలను తెరకెక్కాలని ఆ ప్రయత్నాలు జరగగా ఆ ప్రయత్నాలు మహావతార నరసింహ పేరుతో తెరకెక్కిన సినిమా నేడు విడుదలైంది. అన్ని రకాల ఎమోషన్స్ తో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు కథనం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. పతాక సన్నివేశాల్లో నరసింహావతారంతో ఉన్న సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. టెక్నీకల్ గా కూడా ఉన్నత స్థాయిలో ఈ సినిమా ఉంది. అశ్విన్ కుమార్ కథనం, దర్శకత్వంతో మంచి మార్కులు వేయించుకున్నారు.
సామ్ సీఎస్ సంగీతం, నేపథ్య సంగీతం ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. యానిమేషన్ పాత్రలతో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించేలా ఉంది. యానిమేషన్ కావడంతో ఈ సినిమాలో ప్రతి సీన్ ప్రేక్షకులను కదిలించే విధంగా ఉంది. ఈ సినిమాలోని ప్రతి సీన్ లో విజువల్ గ్రాండ్ నెస్ ఉంది. నిర్మాణం ఉన్నతంగా ఉండగా అశ్విన్ కుమార్ కష్టానికి తగ్గ ఫలితం ఈ సినిమాతో దక్కింది.
బలాలు : ఫస్టాఫ్, క్లైమాక్స్, మ్యూజిక్
బలహీనతలు : కొన్ని సీన్స్ లో సాగదీత
రేటింగ్ : 3.0/5.0