ఇండియా వ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షో లలో బిగ్ బాస్ ఒకటి. మొదట ఇండియాలో హిందీ భాషలో ప్రారంభం అయిన ఈ టెలివిజన్ షో కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దానితో ఈ షో ను ఇండియా వ్యాప్తంగా అనేక ప్రాంతీయ భాషలలో కూడా మొదలు పెట్టారు. అందులో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితమే తెలుగులో కూడా బిగ్ బాస్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. అందులో భాగంగా ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగులో ఎనిమిది బుల్లి తెర సీజన్లను, ఒక ఓ టీ టీ సీజన్ ను కంప్లీట్ చేసుకుంది.

మరికొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రారంభం కాబోతోంది. ఈ సీజన్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 9 మరికొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సారి బిగ్ బాస్   హౌస్ లోకి ఎవరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే దానిపై రోజుకో వార్త వైరల్ అవుతుంది. అందులో భాగంగా తాజాగా ఓ వార్త వైరల్ గా మారింది. అసలు విషయం లోకి వెళితే... ఈ సారి బిగ్ బాస్ హౌస్ లోకి కన్నడ నటి అయినటువంటి కావ్య శెట్టి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఈమె ఇప్పటికే కన్నడ లో చాలా సినిమాల్లో నటించి నటిగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె తెలుగులో గుర్తుందా సీతాకాలం అనే సినిమాలో ముఖ్య పాత్రలో నటించింది. ఇకపోతే ఈమె టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తో కూడా నటించింది. కానీ ఈమె నాగార్జున తో సినిమాలో నటించలేదు. ఒక యాడ్ లో నటించింది. 

ఇకపోతే ఈమె సినిమాల ద్వారా మాత్రమే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ బ్యూటీ తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. మరి కావ్య శెట్టి తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లోకి ఎంట్రీ ఇస్తుందా లేదా అనేది తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని తెలుగు బిగ్ బాస్ లవర్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: