డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు తన కెరియర్లో ఎన్నో సినిమాలుకు దర్శకత్వం వహించి ఎన్నో విజయాలను అందుకున్నాడు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన సరైన విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనకబడిపోయాడు. ఆఖరుగా ఈయన దర్శకత్వంలో రూపొందిన లైగర్ , డబల్ ఇస్మార్ట్ మూవీలు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయలను ఎదుర్కున్నాయి. దానితో ఈయన కెరియర్ గ్రాఫ్ కూడా చాలా వరకు పడిపోయింది. అలాంటి సమయం లోనే ఈయన తమిళ నటుడు విజయ్ సేతుపతి హీరో గా ఓ మూవీ చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఈ సినిమాలో సంయుక్తా మీనన్ హీరోయిన్గా కనిపించనుండగా .. టబు ఈ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ను తాజాగా పూరి కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు తక్కువ సినిమాలకే సంగీతం అందించిన ఈయన సంగీతం అందించిన చాలా సినిమాల మ్యూజిక్ కి మంచి ఆదరణ ప్రేక్షకులను లభించింది. దానితో పూరి  , విజయ్ కాంబోలో రూపొందబోయే సినిమాకు మహతి స్వర సాగర సంగీతం అందించనుండడంతో ఈ మూవీ మ్యూజిక్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది అని చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరి ఈ మూవీ సంగీతం ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే ఇంకా చాలా కాలం చేసి చూడాల్సిందే. పూరి జగన్నాథ్ ఈ మధ్య కాలంలో దర్శకత్వం వహించిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఈయన విజయ్ తో చేయబోయే సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. ఆయన తిరిగి కం బ్యాక్ ఇస్తాడు అని ఆయన అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. మరి విజయ్ సినిమాతో పూరి ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: