కొన్ని సినిమాల స్టోరీస్ రాసే సమయంలో ఆయా హీరోలు హీరోయిన్లను దృష్టిలో పెట్టుకొని దర్శకులు వారికి తగ్గట్టుగా కథలు రాస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి ఆ కథలు వారికి వినిపిస్తే వారికి డేట్స్ కుదరకనో లేదంటే కథ నచ్చకనో రిజెక్ట్ చేస్తూ ఉంటారు. అలా రిజెక్ట్ చేసిన సినిమాలు మరో హీరో లేదా హీరోయిన్ చేసి సూపర్ హిట్స్ అందుకుంటే ఆ సినిమాని నేను ఎందుకు చేయలేకపోయానా అని బాధపడిన సందర్భాలు అనేకం ఉంటాయి. అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అప్పట్లో ఒక అద్భుతమైన హిట్ అందుకున్న సినిమాల్లో నువ్వు లేక నేను లేను ఒకటి... దర్శకుడు కాశీ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ మూవీ  2002లో విడుదలై  యూత్ లో మంచి టాక్ తెచ్చుకుంది. ప్రేమకథా చిత్రంగా వచ్చిన ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడమే కాకుండా  నటీనటులకు, దర్శకుడికి మంచి పేరు తెచ్చింది.

అలాంటి ఈ సినిమాలో తరుణ్ హీరోగా.. ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా చేసిన సంగతి మనందరికీ తెలుసు.. అయితే ఈ సినిమా ముందుగా తరుణ్ తో కాకుండా మరో హీరో ను పెట్టి చేద్దాం అనుకున్నారట దర్శక నిర్మాతలు.. ఆ హీరో ఎవరు ఆ వివరాలు ఏంటో చూద్దాం.. తరుణ్ హీరోగా పెట్టి చేసినటువంటి నువ్వు లేక నేను లేను సినిమా  అప్పట్లో థియేటర్లలోనే బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. తరుణ్ కెరియర్ కి ఈ సినిమా మంచి బూస్టింగ్ ఇచ్చిందని చెప్పవచ్చు. అలాంటి ఈ చిత్రం  స్టోరీ పూర్తయ్యాక మహేష్ బాబుతో సినిమా చేద్దామా అని నిర్మాత సురేష్ బాబు డైరెక్టర్ ని అడిగారట.. దీనిపై స్పందించిన దర్శకుడు మహేష్ బాబుతో ప్రస్తుతం సినిమా అంటే చాలా ఆలస్యమవుతుంది.

ఆయనతో సినిమాలు చేసేందుకు చాలా మంది దర్శక నిర్మాతలు క్యూలో ఉన్నారు. ఇప్పటికే సినిమా ఆలస్యమైంది. ఈ కథకి తరుణ్ బాగా సరిపోతాడు పైగా నువ్వే కావాలి చిత్రంతో యూత్ లో మంచి ఫాలోయింగ్ పెంచుకున్నాడు అంటూ నిర్మాతకు చెప్పాడట.. దీంతో నిర్మాత సురేష్ బాబు కూడా తరుణ్ ని ఫైనల్ చేశారు.. ఈ విధంగా మహేష్ బాబు స్థానంలో తరుణ్సినిమా చేసి  మంచి విజయాన్ని అందుకున్నాడని చెప్పవచ్చు. అయితే ఈ విషయాన్ని డైరెక్టర్ విశ్వనాథ్ ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టడంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: