తాజాగా వరుసగా డిజాస్టర్లు ఎదుర్కొంటూ ఉన్న యంగ్ హీరో నితిన్ మరోసారి తన కెరీర్‌ను ట్రాక్‌లోకి తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ‘మాచర్ల నియోజకవర్గం’,  ‘తమ్ముడు’ లాంటి సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో అభిమానుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ నితిన్‌పై సందేహాలు మొదలయ్యాయి. అందుకే ఈసారి ఎలాంటి తప్పిదం లేకుండా స్క్రిప్ట్ సెలెక్షన్ నుంచే జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే నితిన్‌కి సెంటిమెంట్‌గా మారిన 'ఇష్క్' డైరెక్టర్ విక్రమ్ కే. కుమార్ తో మరోసారి కాంబినేషన్ లాక్ అయింది. ఈసారి వీరిద్దరి కలయికలో రాబోతున్న మూవీ ఒక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ తో ఉండనుందని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా ‘గుర్రపు స్వారీ’ నేపథ్యంలో సాగనుందట. అంటే.. హీరో నితిన్ ఈ సినిమాలో హార్స్ రైడర్ గా కనిపించనున్నాడు.


టైటిల్‌తోనే చర్చ .. ప్రస్తుతం ఈ సినిమాకు ‘స్వారీ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఇదే వర్కింగ్ టైటిల్‌గా ఉండగా, ‘జాకీ’ అనే మరో పేరు కూడా  చర్చలోకి వచ్చింది. కానీ జాకీ పేరుతో శోభన్ బాబు గారి సినిమా ఉండడంతో, కాపీ టెంగ్షన్ కారణంగా దానిని పక్కన పెట్టే అవకాశం ఉంది. పైగా, ‘స్వారీ’ టైటిల్ వినిపించగానే మాస్, స్టైల్ ఫీలింగ్ వ‌స్తుతుంది. అందుకే దీని పైనే ఎక్కువ బజ్ నెలకొంది. స్పోర్ట్స్ డ్రామా – టాలీవుడ్‌లో కొత్త లైన్ .. తెలుగులో గుర్రపు స్వారీ నేపథ్యం మీద సినిమాలు అరుదుగా వస్తాయి. కాబట్టి ఈ జోనర్ యూనిక్‌గానే ఉంటుంది. విక్రమ్ కే. కుమార్ కు న్యూ కాన్సెప్ట్‌లను విలక్షణంగా తెరకెక్కించే స్టైల్ ఉంది. ‘24’, ‘హలో’, ‘ఇష్క్’, ‘మనం’ లాంటి సినిమాల్లో ఆ టాలెంట్ మాంచిగా గమనించగలం. ఇప్పుడు ‘స్వారీ’ లో కూడా అలాంటి కొత్త కోణాలు ఉండే అవకాశం ఉంది.



ప్రీ ప్రొడక్షన్ వేగంగా… ఇప్పటికే స్క్రిప్ట్ దాదాపు ఫైనల్. నితిన్ కథ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ప్రస్తుతం ఇతర నటీనటులు, టెక్నీషియన్స్ ఎంపికపై దృష్టి పెట్టారు. ఫైనల్ లైన్ క్లియర్ అయిన తర్వాత షూటింగ్ షురూ అవుతుంది. ప్రస్తుతానికి ఇదంతా దిల్ రాజు బ్యానర్ లో కాకపోవచ్చని టాక్ ఉంది – ఒక ఫ్రెష్ బ్యానర్ కింద రూపొందే అవకాశం ఉంది. నితిన్ రీబౌండ్ కావాలంటే 'స్వారీ' బలంగా గెలవాలి. స్టోరీ కొత్తదే, డైరెక్టర్ ట్రాక్ లోనే ఉన్నాడు.. ఇప్పుడు బాక్సాఫీస్ మీద రైడ్ వేయాల్సిన పని మాత్రం నితిన్‌దే!

మరింత సమాచారం తెలుసుకోండి: