కొన్ని కొన్ని సినిమాలు మనకి చరిత్రలో గుర్తు ఉండిపోతాయి. సినిమా చేసిన వాళ్ళకి సినిమా చూసిన వాళ్ళకి ఇద్దరికీ అలాంటి ఫీలింగే ఉంటుంది.  మరీ ముఖ్యంగా ప్రభాస్ నటించిన "బిల్లా" మూవీ "బాహుబలి" మూవీ ఎంత లా ప్రభాస్ అభిమానులను ఆకట్టుకునింది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాళ్ళకి ఆ సినిమాలు లైఫ్ లాంగ్  గుర్తుండిపోతాయ్. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఫిలిం సర్కిల్స్ లో ఓ  వార్త బాగా ట్రెండ్ అవుతుంది. బిల్లా సినిమాకి అదేవిధంగా బాహుబలి సినిమాకి ఎలా అయితే ప్రభాస్ చేశాడో .. ఇప్పుడు "ఫౌజి" సినిమాకు  అలాగే చేయబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది .


సాధారణంగా స్టార్ హీరోస్ ఎవరు కూడా తమ సినిమాల క్యారెక్టర్ విషయంలో చనిపోవాలి అని అనుకోరు . కానీ కొంతమంది మాత్రం దాన్ని చాలా సింపుల్ గా తీసుకుని డైరెక్టర్ కి వదిలేస్తూ ఉంటారు . మరి ముఖ్యంగా బిల్లా సినిమాలో చనిపోయిన క్యారెక్టర్ లో కనిపిస్తాడు ప్రభాస్ . అదే విధంగా బాహుబలి సినిమాలో కూడా అమరేంద్ర బాహుబలి క్యారెక్టర్ చనిపోతుంది. అయితే అంతకుముందు ఆ తర్వాత ఎప్పుడూ కూడా ప్రభాస్ అలా చనిపోయిన క్యారెక్టర్ లో నటించలేదు.  కానీ "ఫౌజి" సినిమా కోసం మాత్రం మళ్లీ అదే రిస్క్ చేయబోతున్నాడట .



"ఫౌజి" సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ క్లైమాక్స్ చనిపోతుందట.  ఇది నిజంగా చాలా టఫ్ సిచ్యువేషన్ కలిగించే సీన్స్.  ప్రభాస్ లాంటి పాన్  స్టార్ చనిపోతే ఆ క్యారెక్టర్ ఎవరూ లైక్ చేయరు.  కానీ హను రాఘవపూడి మాత్రం చాలా డేర్ తో ఈ రోల్ ని రాసుకున్నారట . ప్రభాస్ కెరియర్ లోనే ఇది ఒక అద్భుతంగా ఉండబోయే సినిమా అంటూ మూవీ మేకర్స్ కూడా మాట్లాడుతున్నారు . చూడాలి మరి ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతవరకు సెట్ అవితుందో..?? అభిమానులను మెప్పిస్తుందో..? ప్రెసెంట్ దీని గురించి అందరూ జనాలు మాట్లాడుకుంటున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: