టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ ఇమేజ్ కలిగిన హీరోలలో రెబల్ స్టార్ ప్రభాస్ ఒకరు. ప్రభాస్ కి కేవలం తెలుగు సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా ఇండియా వ్యాప్తంగా కూడా అద్భుతమైన క్రేజ్ ఉంది. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ప్రభాస్ కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కూడా ప్రభాస్ నటించిన ప్రతి సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో పెద్ద స్థాయిలో విడుదల అవుతూ వస్తుంది. దానితో ప్రభాస్ క్రేజ్ ఇండియా వ్యాప్తంగా భారీగా పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ , మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ లో నిధి అగర్వాల్ , మాళవిక మోహన్ , రీద్ధి కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తూ ఉండగా ... సంజయ్ దత్ ఈ మూవీలో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. కొంత కాలం క్రితం ఈ మూవీ బృందం ఈ సినిమాను ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దానితో ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన పక్కాగా విడుదల అవుతుంది అని ప్రభాస్ అభిమానులు భావించారు. కాకపోతే ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన విడుదల కావడం కష్టం అని , ఈ సినిమా విడుదల పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది అని , ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 9 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లో రాబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఒక వేళ ఈ సినిమా కనుక జనవరి 9 వ తేదీన విడుదల అయినట్లయితే ఈ మూవీ తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ హీరోగా రూపొందుతున్న జన నాయగన్ మూవీతో పోటీ పడవలసి ఉంటుంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 9 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఒక వేళ ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అయినట్లయితే తమిళనాడు ఏరియాలో రాజా సాబ్ మూవీకి కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: