బ‌హుపాత్రాభిన‌యాలు చేయ‌డం న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌కు కొత్తేమి కాదు. బాలకృష్ణ చేసినన్ని ద్విపాత్రాభినయాలు ఇప్పుడున్న హీరోల్లో మ‌రొక‌రు చేయ‌లేదు. `అధినాయకుడు` చిత్రంలో ఏకంగా త్రిపాత్రాభినయం చేసి అల‌రించిన ఆయ‌న‌.. ఇప్పుడు మ‌రోసారి ట్రిపుల్ రోల్స్ తో నంద‌మూరి ఫ్యాన్స్ కి పూన‌కాలు తెప్పించేందుకు రెడీ అవుతున్నారు. ప్ర‌స్తుతం బాల‌య్య `అఖండ 2` మూవీతో బిజీగా ఉన్నారు. బోయపాటి శ్రీ‌ను తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం ద‌స‌రా బ‌రిలో దూకేందుకు ముస్తాబ‌వుతోంది.


అలాగే `వీర సింహా రెడ్డి`తో క్రేజీ హిట్ అందించిన డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనితో బాల‌య్య మ‌రో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. వీరి కాంబో త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతుంది. ఈ ప్రాజెక్ట్‌కు సమాంతరంగా స్వీయ నిర్మాణంలో `ఆదిత్య 999`ను కూడా పట్టాలెక్కించేందుకు బాల‌య్య‌ ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ సినిమాను డైరెక్ట్ చేసే బాధ్యతలు క్రిష్ జాగ‌ర్ల‌మూడి స్వీక‌రించారు. బాల‌య్య త‌న‌యుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఈ మూవీతోనే ఉండబోతుంది.


అయితే `ఆదిత్య 369`లో బాలకృష్ణ శ్రీకృష్ణ దేవరాయలుగా, కృష్ణ కుమార్‌గా ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ఆదిత్య 999లో బాల‌య్య త్రిపాత్రాభిన‌యం చేయ‌బోతున్నార‌ని నెట్టింట జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. సీక్వెల్‌లో కథానుగుణంగా ట్రిపుల్ రోల్స్ కు ఛాన్స్ ఉంటుంద‌ట‌. కానీ క్రిష్ కథలో ప‌లు మార్పులు చేసి, మూడు పాత్రలను రెండుగా కుదిస్తే బెట‌ర్ అని ఆలోచిస్తున్నార‌ట‌. తుది నిర్ణయం మాత్రం బాలయ్యదే అట‌. ఆయ‌న మూడు పాత్రలు ఉండాల్సిందేనని.. త్రిపాత్రాభినయంలో బాల‌య్య‌ను చూడ‌టం ఖాయ‌మ‌ని అంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు



మరింత సమాచారం తెలుసుకోండి: