టాలీవుడ్ మాస్ హీరో విజయ్ దేవరకొండకి మరోసారి ఓపెనింగ్ వర్కౌట్ అయింది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ "కింగ్డమ్" నిన్న (గురువారం) గ్రాండ్ రిలీజ్ అవుతూ బాక్సాఫీస్ వద్ద మంచి హంగామా చేసింది. వర్కింగ్ డే అయినా కూడా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 35-40 కోట్ల మధ్య గ్రాస్ వసూల్ చేసినట్టు ట్రేడ్ వర్గాల అంచనా. ఇది సాధారణం కాదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే, మొదటి రోజు రికార్డుల పరంగా చూస్తే నాని హోల్డ్ చేసిన టైర్ 2 హీరోల ఫస్ట్ డే రికార్డును బీట్ చేయలేకపోయినట్టు తెలుస్తోంది. దీంతో విజయ్ ఫ్యాన్స్ కొంత నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కానీ గురువారం అనే నాన్ హాలిడేలో ఇలా కాసుల వర్షం కురిపించడం మాత్రం విజయ్ మార్కెట్ పట్ల నమ్మకాన్ని కలిగిస్తోంది.


బుకింగ్స్ ఎలా ఉన్నాయి? నిన్నటి నుంచి అన్ని సెంటర్లలో ఆక్యుపెన్సీ అదిరిపోయింది. ముఖ్యంగా ప్రీమియం మల్టీప్లెక్సుల్లో సాయంత్రం, రాత్రి షోలు ఫుల్ హౌస్ అవ్వడంతో కొన్ని థియేటర్లలో అదనపు షోలు వేసే పరిస్థితి వచ్చింది. ఈ పరిణామం "కింగ్డమ్"కి ఉన్న క్రేజ్‌ని స్పష్టంగా తెలియజేస్తోంది. టాక్ ఎలా ఉంది? .. ఇక్కడే కొంచెం మిక్స్‌డ్ గేమ్ ఆడుతుంది. మొదటి భాగం వరకు స్పీడు మెయింటైన్ చేసిన కథ, సెకండాఫ్కి వచ్చే సరికి ఫ్లాట్గా మారినట్టు స్పందనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ పాయింట్ వద్ద విజయ్ దేవరకొండ పాత్రను అండర్‌ప్లే చేయడం కొందరికి నచ్చలేదు. పార్ట్ 2 కోసం కథని పొడిగించడమే దర్శకుడు ఉద్దేశం అయినా, ప్రేక్షకుడు అదే డిప్ గా ఫీలవుతున్నాడు . వీకెండ్ స్పెషల్! ఇప్పుడున్న పరిస్థిలో వారాంతపు మూడు రోజులు (శని-ఆది-సోమ) ఎంతో కీలకం.


ఈ గ్యాప్‌లో “కింగ్డమ్” అదే ట్రెండ్‌ని మెయింటైన్ చేస్తే, ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ అందుకోవడం తేలికగా మారుతుంది. నిర్మాతలు కూడా ఇదే గేమ్ ప్లాన్‌ మీద నమ్మకంగా ఉన్నారు. పోటీ లేదు, ఛాన్స్ ఉంది.. తెలుగులో ప్రస్తుతం హరిహర వీరమల్లు పూర్తిగా తగ్గిపోయింది. అంటే ఈ వీకెండ్ "కింగ్డమ్"కి పెద్దగా పోటీ లేదు. ఉత్తరాదిలో సన్నాఫ్ సర్దార్ 2, ధఢక్ 2లు ఉన్నా, వాటి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో ఉండదు. అమెరికాలో విజయ్ హవా .. యుఎస్ లో 1 మిలియన్ మార్క్‌ను తొలిరోజే క్రాస్ చేసిన విజయ్ దేవరకొండ, అక్కడ మళ్ళీ తన మార్కెట్ నిలబెట్టుకున్నాడుని చెప్పాలి. మొత్తం మీద, 'కింగ్డమ్'కి ఓపెనింగ్ ఖచ్చితంగా మాస్.. కానీ క్లాస్ టచ్ ఉండాలంటే కంటెంట్ అండ కావాలి. మూడు రోజుల్లో ఈ సినిమా గేమ్ మారుస్తుందా లేదా అనేది ఈ వీకెండ్ షోస్ పైనే ఆధారపడి ఉంది !

మరింత సమాచారం తెలుసుకోండి: