ఈ వార్తలో ఎంత నిజం ఉంది  అనేది తెలియనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా ట్రెండ్ అవుతుంది . ఈ సినిమా రేంజ్ అలాంటిది . రాజమౌళి సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ రావడం అంటే మామూలు విషయం కాదు . దానికి ఎన్నో శాక్రిఫైజ్ లు చేయాలి ..ఎన్నెన్నో కాల్ షీట్స్ ఇవ్వాలి.. ఎంతో కష్టం భరించాలి . అవన్నీ భరించడానికి సిద్ధమై మహేష్ బాబు  సినిమా కోసం కాల్ షీట్స్ కేటాయించింది గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా . ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఆమె ఎన్నెన్నో మంచి సినిమాలలో నటించి ఎన్నెన్నో అవార్డ్స్ తన ఖాతాలో పడేలా చేసుకుంది.
 

ఒక్కొక్క సినిమాకి 15 కోట్లకు పైగానే రెమ్యూనిరేషన్ తీసుకుంటుంది ఈ బ్యూటీ . దానికి తగ్గట్టే కండిషన్స్ కూడా పెడుతూ ఉంటుంది . కాగా ప్రియాంక చోప్రా ..రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో ఓ సినిమాను ఓకే చేసిన విషయం అందరికీ తెలిసిందే. దీనికోసం ఆమె ప్రత్యేకంగా కొన్ని నృత్యాలు కూడా నేర్చుకుంటుంది అంటూ టాక్ వినిపించింది.  అయితే సడన్ గా ఈ ప్రాజెక్టు నుంచి ప్రియాంక చోప్రా తప్పుకుంది అంటూ బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.  ఆమె కొన్ని అనారోగ్య కారణాల చేత ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట . ఆమె హెల్త్ కండిషన్ బాగోలేని కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంది అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది . అయితే దీనిపై ఇప్పటివరకు అటు రాజమౌళి కానీ మహేష్ బాబు మూవీ టీం కానీ ప్రియాంక చోప్రా కానీ అఫీషియల్ ప్రకటన చేయలేదు.
 

దీంతో ఫాన్స్ లో అయోమయ పరిస్థితి నెలకొన్నింది. నిజంగా ఇది నిజమేనా..? లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఫేక్ నా..? ఏమో దీని పై చిత్ర బృందం స్పందిస్తే బాగుంటుంది . లేకపోతే దీనికి జరగాల్సిన నష్టం తీవ్ర స్థాయిలో జరిగిపోతుంది అంటూ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం మహేష్ బాబు - రాజమౌళి ఫిలిం నుంచి ప్రియాంక చోప్రా అనారోగ్య కారణంగా తప్పుకుంది అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. చాలామంది బాలీవుడ్ స్టార్స్ ఈ విధంగా ఆమెపై తప్పుడు వార్తలు క్రియేట్ చేస్తున్నారు అంటూ మండిపడుతున్నారు.  ప్రియాంక చోప్రా ఒక బాలీవుడ్ బడా స్టార్ హీరో సినిమా రిజెక్ట్ చేసి మరి మహేష్ బాబుతో సినిమాకు కమిట్ అయింది  . బహుశా ఆ కోపంతోనే ఇలా చేస్తున్నారేమో అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: