
అయితే త్వరలోనే లావణ్య శ్రీమంతం జరగబోతుంది . మెగా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని ఒకే చోట చూడబోతున్నాం అంటూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్. అయితే లావణ్య శ్రీమంతం కంటే ముందే మెగా ఫ్యామిలీ లో మరొక ఫంక్షన్ జరగబోతుంది అన్న వార్త బాగా వైరల్ గా మారింది. లావణ్య త్రిపాఠి - వరుణ్ పెళ్లి తర్వాత ఎటువంటి పార్టీని అసలు మెగా ఫ్యామిలీలో కండక్ట్ చేయనేలేదు . పెళ్ళికి ముందు చిన్న పార్టీ కండక్ట్ చేసిన తర్వాత పెళ్ళి పూర్తి సాంప్రదాయబద్ధంగా జరిపారు.
ఈ క్రమంలోనే శ్రీమంతం కంటే ముందే ఎప్పటినుంచో ఒక పార్టీని ఇవ్వాలి అనుకుంటున్నారట లావణ్య త్రిపాఠి - వరుణ్ . అది ఇన్నాళ్లకు సెట్ అయినట్లు తెలుస్తుంది . శ్రీమంతం అంటే చాలా ట్రెడిషనల్ గా ఉండాలి . అందరూ రిలేటివ్స్ ని అందరి ఫ్రెండ్స్ ని పిలవాలి . అయితే మెగా ఫ్యామిలీ వరకే కేవలం మెగా కుటుంబం వరకే ఒక ఫంక్షన్ జరుపుకునేలా లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ ప్లాన్ చేశారట . ఇది ఆమె శ్రీమంతం కంటే ముందే జరిగితే బాగుంటుంది అంటూ రీసెంట్ గానే దీనిని ఫైనలైజ్ చేసారట . నాగబాబు ఇంట్లోనే ఈ ఫంక్షన్ చేయబోతున్నారట. సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. మెగా ఫ్యామిలీ అందరిని ఒకచోట చూసి చాలా కాలం అవుతుంది . ఇప్పుడు ఈ ఫంక్షన్ పుణ్యమా అంటూ మరొకసారి అందరిని ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో చూడొచ్చు అంటున్నారు మెగా ఫ్యాన్స్. అయితే ఈ ఫంక్షన్ కి అల్లు అర్జున్ ని పిలుస్తారా? పిలిస్తే ఆయన వస్తారా..? అనేది బిగ్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!