ప్రముఖ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి నుంచి చాలాకాలం తర్వాత వస్తున్న చిత్రం `సతీ లీలావతి`. వరుణ్ తేజ్ తో వివాహం తర్వాత సినిమాల ఎంపికలో లావణ్య సెలెక్టివ్ గా వ్యవహరిస్తుంది. అందులో భాగంగానే తాతినేని సత్య దర్శకత్వంలో సతీ లీలావతి సినిమాకు సైన్ చేసింది. ఇందులో దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నాడు. దుర్గాదేవి పిక్చర్స్‌, ట్రియో స్టూడియోస్‌ బ్యానర్లపై నాగమోహన్‌బాబు ఎం, రాజేష్‌.టి నిర్మిస్తుండగా.. మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నాడు.


ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ మూవీ టీజ‌ర్ ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. లవ్‌, డ్రామా, ఫ‌న్‌ ఎలిమెంట్స్‌తో టీజ‌ర్ సాగ‌గా.. లావ‌ణ్య మ‌రోసారి త‌న న‌ట‌న‌తో అద‌ర‌గొట్టింది. గ‌త ఏడాది డిసెంబ‌ర్ లో స‌తీ లీలావ‌తి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశారు. ఫిబ్ర‌వ‌రిలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ఆ కొద్ది రోజుల‌కే లావ‌ణ్య త్రిపాఠి ప్రెగ్నెంట్ అయింది. దాంతో చాలా మంది స‌తీ లీలావ‌తి సినిమా ఆగిపోయింద‌ని అనుకున్నారు.


కానీ ప్రెగ్నెన్సీలోనూ లావ‌ణ్య రెస్ట్ తీసుకోకుండా షూటింగ్ లో పాల్గొంది. ఈ విష‌యాన్ని లావ‌ణ్య అక్క శివాని త్రిపాఠి సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేసింది. లావ‌ణ్య డెడికేష‌న్ కు అక్క కూడా షాక్ అయింది. తాజాగా స‌తీ లీలావ‌తి టీజ‌ర్ ను ఇన్‌స్టాలో పంచుకున్న శివాని.. `నిన్ను చూస్తే ఎంతో గ‌ర్వంగా ఉంది. ప్రెగ్నెన్సీలో మొద‌టి మూడు నెల‌లు ప‌ని చేస్తూనే ఉన్నావు. అలా ఎలా చేశావ్‌? ప్ర‌తిసారి లాగానే టాలెంట్ తో చంపేశావ్‌` అంటూ స్టోరీ పెట్టారు. ఆమె పోస్ట్ కాస్త ఇప్పుడు వైర‌ల్ గా మారింది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: