సినీ పరిశ్రమల పట్ల గౌరవం ఉన్నవాళ్లు మాట్లాడితేనే ప్రజలు కాస్త ఆలోచిస్తారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉన్నాడు మాధవన్. ఇండస్ట్రీలో “మ్యాడీ సర్” అని పిలవబడేంత గౌరవం పొందిన నటుడు, తాజాగా ఓ వేడుకలో మాట్లాడుతూ బాలీవుడ్ మరియు కోలీవుడ్‌పై ఎప్పటికప్పుడు జరుగుతున్న “పతనం” ప్రచారాన్ని గట్టిగా కొట్టిపారేశారు. ప్రస్తుతం తన తాజా ఓటీటీ సినిమా "ఆప్ జైసా కోయి" ప్రమోషన్‌లో భాగంగా పాల్గొన్న మాధవన్ మాట్లాడుతూ… “ప్రతి రెండేళ్లకోసారి బాలీవుడ్ అంతైంది అంటారు. కోలీవుడ్ కూడా పడిపోయిందంటారు. కానీ ఇవన్నీ మితిమీరిన ఊహలు. సినిమాలు బాగుంటే ప్రజలు చూస్తారు.'


పరిశ్రమలు ఎప్పుడు డౌన్ అయ్యేవి కావు, అలాగే ఎప్పటికీ టాప్‌లో ఉండేవి కూడా కావు. ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. ఇది సహజమే,” అంటూ స్పష్టంగా చెప్పారు.  ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎందుకంటే ప్రస్తుతం కొన్ని యూట్యూబ్ ఛానళ్లూ, సోషల్ మీడియా హ్యాండిల్స్ లాంటివి ఇండస్ట్రీల పతనాన్ని చర్చగా మలుస్తూ నెగెటివ్ గా  వైరల్ కంటెంట్ కోసం విమర్శలకే పని చేస్తున్నాయన్న అభిప్రాయం ఉంది. మ్యాడీ మాత్రం అందుకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అతని మాటల్లో ప్రామాణికత ఉంది. ఎందుకంటే మాధవన్ నటించిన "రాకెట్" వంటి సినిమాలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నవి. ఇటీవలి కాలంలో బాలీవుడ్‌లో "దే దే ప్యార్ దే 2", "ధురంధర్" వంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా ఉన్న మ్యాడీ, తమిళ సినిమాల్లో కూడా కీలక పాత్రలతో న‌టిస్తున్నాడు. 


ఈ నేపథ్యంలో ఆయన చెప్పిన మాటలు పరిశ్రమకు అద్దం పట్టేలా ఉన్నాయి. ఒక్క సినిమా హిట్ అవుతే పొగిడేయడం, ఒక ఫ్లాప్ వస్తే పరిశ్రమ పతనం అంటూ ట్యాగ్ వేయడం మానుకోవాలని సూచిస్తున్నారు. నిజంగా సినీ పరిశ్రమను ప్రేమించేవాళ్లే ఇలాంటి మాటలు చెప్తారు. మ్యాడీ మాటల్లో హుందాతనం ఉండటమే కాదు, పరిశ్రమల పట్ల గౌరవం కూడా నిండుగా కనిపిస్తుంది. ఇక మాధవన్ నెక్ట్స్ ప్రాజెక్టులపై ఆసక్తి పెరుగుతోంది. మాస్ ప్రేక్షకుడి మనసు కూడా గెలుచుకుంటున్న ఈ నటుడి మాటలు, ఇండస్ట్రీకు మంచి గుర్తు, మార్గదర్శకంగా నిలవాల్సిందే!


మరింత సమాచారం తెలుసుకోండి: