ఈ మధ్యకాలంలో సినిమా తెరకెక్కించే డైరెక్టర్స్ కన్నా.. సినిమాలో నటించే హీరో హీరోయిన్కన్నా ..సినిమాలు చూసి సినిమా హిట్టా ..ఫట్టా అని తేల్చేసే జనాలు ఎక్కువైపోయారు.  కొన్ని సంవత్సరాలు లేదా కొన్ని నెలలు కష్టపడి డైరెక్టర్ ఆ సినిమాని తెరకెక్కిస్తాడు. కానీ ఆ డైరెక్టర్ చేతిలో ఏమీ ఉండదు. ఇక సినిమా కోసం రాత్రి పగలు  నటించడానికి బాగా కష్టపడుతూ ఉంటారు కొందరు యాక్టర్స్ . వాళ్ళ చేతుల్లోనూ రిజల్ట్ ఏమీ ఉండదు . థియేటర్ కి వచ్చి సినిమా చూసే జనాల చేతుల్లోనే ఉంటుంది.  కానీ ఇప్పుడు మాత్రం పూర్తిగా ట్రెండ్ మారిపోయింది.  థియేటర్ కి వచ్చి సినిమా చూసి రివ్యూ ఇచ్చే జనాల కన్నా థియేటర్ కి రాకుండానే సినిమాని ఒక యాంగిల్ లో అభిప్రాయపడి రివ్యూస్ ఇస్తూ సినిమా ఇండస్ట్రీని బ్రష్టు పట్టించేస్తున్నారు కొందరు రివ్యూవర్లు అంటూ చాలామంది సినీ మేకర్స్ మండిపడుతున్నారు .

కొంతమంది ఏకంగా అసలు ఈ రివ్యూస్ ని బ్యాన్ చేయాలి అంటూ కోర్టులో కూడా కేసు వేశారు. అలాంటి పరిస్థితులు కూడా మనం చూసాం . అంతేకాదు కొంతమంది అలా రివ్యూస్ ఇచ్చేవాళ్లని సిగ్గు లేదా అని కూడా  తిడుతూ ఉంటారు. కాగా రీసెంట్గా రిలీజ్ అయిన "కింగ్డమ్" సినిమాకి సంబంధించి హీరో విజయ్ దేవరకొండ నిర్మాత నాగ వంశీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు . సినిమా రిజల్ట్ ఏ విధంగా వచ్చింది ..? నిజంగానే సినిమా హిట్టా..? లేకపోతే ఫేక్ కలెక్షన్స్ నా..? ఇలా రకరకాలుగా అన్ని విషయాల గురించి మాట్లాడుకున్నారు.  అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది..? అసలు రివ్యూవర్స్ ఎలా సినిమా ఇండస్ట్రీని బ్రష్టు పట్టిస్తున్నారు.. సినిమాకి సినిమా రివ్యూవర్స్ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు ..?? అన్న విషయాలపై కూడా పరోక్షకంగా స్పందించారు .

ఇదే మూమెంట్లో ప్రొడ్యూసర్ నాగ వంశీ మాట్లాడుతూ.." అసలు ఈ మధ్యకాలంలో నేను ఒక రివ్యూ చూశాను . చాలా దారుణంగ ఉంది. ముందర మైక్ పట్టుకున్నారు కదా అని నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తారా? ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఉంది అని మీకు ఇష్టం వచ్చినట్లు చెప్పేస్తారా..? కామెన్ సెన్స్ ఉందా అసలు..? ప్రతి ఒక్కడు సినిమా చూశాక ఇది ఆర్ఆర్ఆర్ రేంజ్ లో లేదు ..బాహుబలి రేంజ్ లో లేదు అంటే ఎలా..? రాజమౌళి డైరెక్షన్ రాజమౌళిది మిగతా డైరెక్టర్స్  స్టామినా మిగతా వాళ్లది ..అన్ని రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలు కావు కదా..? అంటూ కోపంగా మండిపడ్డారు". ఎప్పుడు సైలెంట్ గా ఉండే నాగవంశ్రీ ఈ రేంజ్ లో ఫైర్ అవ్వడానికి కారణం కింగ్డమ్ కి వచ్చిన రిజల్ట్ అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. కాగా విజయ్ దేవరకొండ హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది . కొంతమంది విజయ్ అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చలేదు అని ఓపెన్ గా కామెంట్స్ చేశారు..!




మరింత సమాచారం తెలుసుకోండి: