విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో . విజయ్ దేవరకొండ ను ఏ రేంజ్ లో అభిమానులు లైక్ చేస్తూ ఉంటారని దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.  ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ హిట్ కొట్టనేలేదు.  ఆయన లాస్ట్ గా నటించిన "ఫ్యామిలీ స్టార్" అంతకంటే ముందు నటించిన "లైగర్"  సినిమా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ అయ్యాయి . మధ్యలో "ఖుషి" సినిమా హిట్ అయ్యింది. కానీ విజయ్ దేవరకొండ ఖాతాలో మాత్రం ఆ క్రెడిట్ పడలేకపోయింది. విజయ్ దేవరకొండ అభిమానులు ఆయన ఒక్క హిట్ కొడితే చూడాలి అంటూ వెయిట్  చేస్తున్నారు . అయితే విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా "కింగ్డమ్" .

భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రీసెంట్గా రిలీజ్ అయ్యింది. మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకున్నింది.  సూపర్ డూపర్ హిట్ అనే టాక్ వినిపించలేదు కానీ ఓకే యావరేజ్ ఒకసారి చూడొచ్చు అని జనాలు మాట్లాడుకున్నారు . అంతేకాదు కొంతమంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా గురించి బిలో యావరేజ్ అంటూ కామెంట్ చేశారు . ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు వేరువేరుగా ఉన్నాయి అంటూ బోరింగ్ ఫిలిం అంటూ కొంతమంది కామెంట్స్ పెట్టారు.  కాగా రీసెంట్ గా విజయ్ దేవరకొండ అదే విధంగా కింగ్డమ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

సినిమాకి సంబంధించి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు . కాగా విజయ్ దేవరకొండ ఈ ఇంటర్వ్యూలోనే తనకి సంబంధించిన కొన్ని విషయాలను ఓపెన్ గా చెప్పుకొచ్చారు . మరీ ముఖ్యంగా రష్మిక మందన్నా.. "కింగ్డమ్" సినిమా పై పెట్టిన పోస్ట్.. అదే విధంగా రష్మిక - విజయ్ దేవరకొండ మధ్య రిలేషన్షిప్ గురించి కూడా పరోక్షకంగా ఓపెన్ అప్ అయ్యారు . ఇదే మూమెంట్లో ఆయన మనసు బాగా ఎమోషనల్ గా ఫీల్ అయిన మూమెంట్ గురించి షేర్ చేసుకున్నారు." కింగ్డమ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనురాగ్ అన్న కాల్ చేశారు అని .. ఆ టైంలో థియేటర్ వెనకాల ఫుల్ అరుపులు కేకులు వినిపిస్తున్నాయి అని .. అనురాగ్ కూడా ఏడుస్తున్నాడు అని ..ఎమోషనల్ అయిపోతున్నాడు అని.. మనం కొట్టాం అన్నా.. మనం కొట్టాం అంటూ ఆనందం ఏడుస్తూ చెబుతున్నాడు అని .. ఆ టైంలో నాకు చాలా చాలా ఏడుపు వచ్చేసింది అని ..జనాలు ఇలాంటి హిట్ కోసమే వెయిట్ చేస్తున్నారు అని నాకు అప్పుడు అర్థమైంది " అంటూ తను ఎమోషనల్ గా ఫీల్ అయిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు . సోషల్ మీడియాలో ఇప్పుడు విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు బాగా వైరల్ అవుతున్నాయి..!!


మరింత సమాచారం తెలుసుకోండి: