
యాంకర్ ఇలా అడుగుతూ.. కమిట్ అయిన సినిమాలను పక్కనపెట్టి పార్ట్ 2 ముందు తెరకెక్కించే అవకాశం ఉందా అని అడగగా.. అందుకు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. సినిమా స్టోరీ ఇంకా పూర్తి కాలేదు.. కొంత సమయం పడుతుందని చెబుతూ ఉండగా నిర్మాత నాగ వంశీ మాట్లాడుతూ.. విజయ్ గారు తదుపరి రెండు చిత్రాలు పూర్తి అయిన తర్వాతే అంటూ తెలిపారు. ఇక క్లైమాక్స్ లో ఎవరైనా స్టార్ హీరో నటిస్తారని సరదాగా చెప్పారా అని యాంకర్ నాగవంశీని అడగగా..
అందుకు నాగ వంశీ మాట్లాడుతూ అలా సరదాగా ఏమీ లేదండి నిజంగానే నటిస్తున్నారంటూ తెలిపారు. హీరో రానా గారు నటిస్తున్నారంట కదా అంటూ మరొక యాంకర్ ప్రశ్నించారు.. ఇంకా అంత దూరం వెళ్లలేదు అంటూ నాగవంశీ తెలిపారు. రెండు రోజులు షూటింగ్ అయ్యింది అనే విషయం పైన మాట్లాడుతూ.. లేదు అలాంటిది ఏమీ లేదు కేవలం విజయ్ తో ఉన్న స్నేహం వల్లే వచ్చి వెళ్లారు అంటూ తెలిపారు నాగ వంశీ.. రానా గారైతే కాదు.. కానీ ఒక హీరో అయితే వస్తారు అంటూ తెలిపారు నాగ వంశీ. కింగ్డమ్ 2 లో రానా నటిస్తున్నారనే విషయంపై క్లారిటీ ఇచ్చేశారు.మరి ఆ హీరో ఎవరనే విషయంపై నాగవంశీ ఎప్పుడు తెలియజేస్తారో చూడాలి మరి.