పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఈ సినిమాను నిర్మించాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా బృందం ఈ మూవీ ప్రమోషన్లను మొదలు పెట్టింది. అందులో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి  సాంగ్ ను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది.

మూవీ కి సంబంధించిన ఫైర్ స్ట్రోమ్ అంటూ సాగే మొదటి పాటను తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సాంగ్ కి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. 24 గంటల్లో ఈ సినిమా మొదటి సాంగ్ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన వ్యూస్ , లైక్స్ దక్కాయి. లైక్స్ విషయంలో ఏకంగా టాలీవుడ్ రికార్డును ఈ మూవీ మొదటి సాంగ్ సృష్టించింది. ఇకపోతే ఓజి మూవీలోని ఫైర్ స్ట్రామ్ అంటూ సాగే మొదటి సాంగ్ కు విడుదల అయిన 24 గంటల్లో 6.22 మిలియన్ వ్యూస్ దక్కగా , 830.5 కే లైక్స్ లభించాయి.

ఇకపోతే ఈ సినిమా మొదటి సాంగ్ లైక్స్ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డును సృష్టించింది. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఏ సాంగ్ కి కూడా విడుదల అయిన 24 గంటల్లో  ఈ స్థాయి లైక్స్ రాలేదు. ఇలా ఓజి మూవీలోని ఫైర్ స్ట్రోమ్ సాంగ్ అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ జనాల నుండి దక్కించుకుంది. ఈ మూవీ పై పవన్ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

pk