
ఈ కొత్త సినిమా కథాంశంపై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ఇది రెండు విభిన్న కాలాలలో నడిచే కథ అని తెలుస్తోంది. ఒకటి చారిత్రక నేపథ్యం కాగా, మరొకటి వర్తమాన కాలం. ఇలాంటి కథాంశం బాలయ్య కెరీర్‌లోనే ఒక ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
వీరసింహారెడ్డితో మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన గోపీచంద్ మలినేని, ఈసారి బాలయ్యను చారిత్రక, సమకాలీన కోణాల్లో ఎలా చూపిస్తారన్నది ఉత్కంఠగా మారింది. రెండు కాలాల నేపథ్యం, బలమైన కథనం, బాలయ్య ఎనర్జిటిక్ నటన కలగలిసి ఈ సినిమా మరో బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు వెలువడే అవకాశం ఉంది.
ఈ ఏడాదే ఈ సినిమా రెగ్యులర్ షూట్ మొదలు కానుందని సమాచారం అందుతోంది. మరోవైపు బాలయ్య పారితోషికం సైతం 40 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సైతం ఈ సినిమా స్పెషల్ సినిమాగా నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఏ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాల్సి ఉంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు