
టాలీవుడ్ కింగ్ నాగార్జున తన ఇమేజ్ చట్రం నుంచి బయటకు రావాలని బలంగా ఫిక్స్ అయ్యారు. ఇటు హీరోగా సినిమాలు చేస్తూనే బలమైన పాత్రలు ఉంటే చేయటానికి కూడా ఓకే చెబుతున్నారు. కుబేర సినిమా అలాగే చేశారు. ఈ సినిమాలో నాగార్జున నటనకు మంచి అప్లాజ్ వచ్చింది. ఇప్పుడు రజనీకాంత్ కూలీ సినిమాలో నాగార్జున విలన్ గా చేస్తున్నారు. విలన్ గా ఆయనకు ఇదే మొదటి సినిమా. ఈ పాత్రలో నాగార్జునను ఒప్పించడానికి దర్శకుడు లోకేష్ కనకరాజ్ దాదాపు 6 నెలలు శ్రమించాల్సి వచ్చింది. ఏడుసార్లు నరేషన్ కూడా ఇచ్చారట. నాగార్జున కొన్ని మార్పులు కూడా చెప్పారట. ఆ మార్పులకు లోకేష్ అంగీకరించిన తర్వాత కూలీ ప్రాజెక్ట్ లోకి నాగార్జున వచ్చాడు .కూలీ లో తన క్యారెక్టర్ విషయంలో నాగార్జున కాస్త ముందు చూపుతోనే వ్యవహరించారు.
కుబేర సినిమా విషయంలో నాగార్జున ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. కుబేరకు వచ్చిన తర్వాత సక్సెస్మెంట్లో శేఖర్ కమ్ముల ఈ కథ చెప్పినప్పుడే కుబేర నా కథే అనిపించింది .. నేనే సెంటర్ పాయింట్ అని నాకు చెప్పటం ట్రోలింగ్ కు దారితీసింది. సినిమాకు హిట్ టాక్ వచ్చిన తర్వాత నాగార్జున క్రెడిట్ మొత్తం తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్స్ అనిపించాయి. దీంతో నాగర్జున ఇది దీపక్ సినిమా .. దేవా సినిమా అంటూ క్యారెక్టర్లకు క్రెడిట్ ఇచ్చి తన స్టేట్మెంట్ సరిదిద్దారు. ఇప్పుడు కూలి విషయంలో ఇందులో ఆల్మోస్ట్ హీరో లాంటి పాత్ర చేశానని విడుదలకు ముందే తన వైపు నుంచి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. హీరోగా సినిమాలు చేస్తే కష్టం అని తన ఫ్యూచర్ అర్థమయ్యేలా బలమైన పాత్రలకు కూడా ఒకే చెబుతున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు