బాబీ డియోల్.. `యానిమ‌ల్‌` మూవీతో ఈ బాలీవుడ్ న‌టుడు సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనూ విప‌రీత‌మైన క్రేజ్ సంపాదించుకున్నాడు. బాబీ డియోల్ అస‌లు పేరు విజయ్ సింగ్ డియోల్‌. 90వ ద‌శ‌కంలో ఈయ‌న హీరోగా కెరీర్ ప్రారంభించారు. బాబీ డియోల్ సినీ ప్ర‌యాణం ఆశాజనకంగా మొదలైన‌ప్ప‌టికీ.. మధ్యలో తడబడింది. సరైన హిట్స్ ప‌డ‌క‌పోవ‌డం, అవకాశాలు పూర్తిగా త‌గ్గిపోవ‌డంతో యాక్టింగ్ నుంచి బాబీ డియోల్ కొంత గ్యాప్ తీసుకున్నారు. ఇదే త‌రుణంలో డిప్రెష‌న్‌కి కూడా లోన‌య్యారు.


అయితే మ‌ళ్లీ ఆయ‌న కెరీర్ కు బూస్ట్ ఇచ్చిన చిత్రం యానిమ‌ల్‌. సందీప్ రెడ్డి వంగా తెర‌కెక్కించిన ఈ సినిమాతోనే బాబీ డియోల్ తిరిగి ఫామ్‌లోకి వ‌చ్చారు. సౌత్‌లో మోస్ట్ వాంటెడ్ విల‌న్‌గా మారారు. రీసెంట్ టైమ్‌లో `కంగువ‌`, `డాకు మ‌హారాజ్‌`, `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు` చిత్రాల్లో ప్ర‌తినాయ‌కుడిగా అల‌రించిన బాబీ డియోల్‌.. ప్ర‌స్తుతం `జన నాయగన్`, `ఆల్ఫా` అనే చిత్రాలు చేస్తున్నారు.
ఇక‌పోతే బాబీ డియోల్ వైఫ్‌ను ఎప్పుడైనా చూశారా..? ఆమె గ్లామ‌ర్ ముందు చాలా మంది హీరోయిన్లు కూడా దిగ‌దుడుపే. బాబీ డియోల్ భార్య పేరు  తాన్యా  డియోల్. ఈమె ఇంటీరియర్ డిజైనర్ మ‌రియు ప్రొఫెషనల్ స్థాయిలో డెకరేటర్. తాన్యాకి `ది గుడ్ ఎర్త్‌` అనే ఫర్నిచర్ & హోమ్ డెకర్ బ్రాండ్ కూడా ఉంది. 1996లో బాబీ డియోల్‌, తాన్యా వివాహం చేసుకున్నారు. ఈ దంప‌తుల‌కు ఆర్యమాన్ డియోల్, ధర్మ డియోల్ అనే ఇద్ద‌రు కుమారులు ఉన్నారు.


ఇటీవల ముంబైలో జరిగిన అర్పితా ఖాన్ బ‌ర్త్‌డే వేడుకలకు బాబీ డియోల్ తన భార్య తాన్యా డియోల్ తో కలసి హాజరయ్యారు. మ‌ల్టీక‌ల‌ర్ డ్రెస్‌లో తాన్యా లుక్ అంద‌ర్నీ ఆట‌క‌ట్టుకుంది. లైటు వెలుగుల్లో ఆమె మ‌రింత బ్రైట్‌గా మెరిసిపోతూ ఈవెంట్‌లో స్పెష‌ల్ అట్రాక్ష‌న్ గా నిలిచింది. తాన్యా ఏజ్ 49. అయిన కూడా చాలా యంగ్ గా క‌నిపిస్తూ హీరోయిన్ల‌కే పోటీ ఇస్తుంద‌ని సినీ ప్రియులు కామెంట్లు చేయ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: