టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న కొంత మంది సీనియర్ స్టార్ హీరోయిన్లు ఉన్నారు. అలాంటి వారిలో కొంత మంది ఈ మధ్య కాలంలో వరుస పెట్టి సినిమాలు చేయడం లేదు. అలాంటి వారు ఎవరు అనేది తెలుసుకుందాం.

అనుష్క : టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన సీనియర్ స్టార్ హీరోయిన్లలో ఈమె ఒకరు. ఈమె చాలా కాలం పాటు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కెరియర్ను కొనసాగించింది. ప్రస్తుతం కూడా ఈమెకు అద్భుతమైన గుర్తింపు ఉంది. అనుష్క అడపా సినిమాల్లో నటిస్తోంది. కానీ వరుస పెట్టి సినిమాలతో ప్రేక్షకులను అలరించడం లేదు. తాజాగా ఈమె ఘాటి అనే సినిమాలో నటించింది. ఈ మూవీ మరి కొంత కాలంలో విడుదల కానుంది.

కాజల్ అగర్వాల్ : ఈ ముద్దుగుమ్మ చాలా కాలం క్రితం సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ కాలం లోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. ఇక ఎన్నో సినిమాలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ఈమె ఈ మధ్య కాలంలో సినిమాల సంఖ్యను చాలా వరకు తగ్గించింది.

సమంత  : టాలీవుడ్ ఇండస్ట్రీ లో అత్యంత తక్కువ సమయం లో స్టార్ హీరోయిన్ స్టేటస్ను అందుకున్న ముద్దుగుమ్మలలో ఈమె ఒకరు. ఈమె ఏం మాయ చేసావే అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలలో ఎక్కువ శాతం సినిమాలు మంచి విజయాలు సాధించడంతో ఈమె స్టార్ హీరోయిన్ స్టేటస్ కి చాలా తక్కువ సమయంలో చేరుకుంది. ఈమె కూడా ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటించడం లేదు. చాలా తక్కువ సినిమాలను ఓకే చేస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

ఇలా ఈ ముగ్గురు బ్యూటీలు కూడా స్టార్ ఈమేజ్ ఉన్నా కూడా వరుస పెట్టి సినిమాల్లో నటించకుండా చాలా తక్కువ సినిమాల్లో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: