ఒకే సినిమాతో (ప్రస్థానం) డైరెక్టర్లలో "కల్ట్" స్టేటస్ తెచ్చుకున్న దేవ కట్ట.. ఆ తర్వాత తన కెరీర్‌ను నిలబెట్టుకోవడంలో మాత్రం ఫామ్ అందుకోలేకపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆటోనగర్ సూర్య నుంచి డైనమైట్, తర్వాత రిపబ్లిక్ వరకూ డిజాస్టర్ షెడ్యూల్‌తో ఫ్యాన్స్‌కి తీవ్ర నిరాశను మిగిల్చారు. ఫిల్మ్ మేకర్‌గా ప్యాషన్ ఉన్నా.. కమర్షియల్ సక్సెస్ అందుకోలేక పోయారు. అయితే ఇప్పుడు, నాలుగేళ్ల గ్యాప్ తర్వాత "మయసభ" వెబ్‌సిరీస్‌తో మళ్ళీ హవా చూపిస్తున్నారు. కిరణ్ జయ్ కుమార్ కో-డైరెక్టర్‌గా ఉన్నప్పటికీ, సిరీస్ టాక్ మొత్తం దేవ కట్ట పైనే పడి మోగిపోతోంది.


ఇక  "ఇది ఫిక్షనల్ స్టోరీ" అన్న ట్యాగ్ పెట్టినా, వైఎస్సార్, చంద్రబాబు, ఎన్టీఆర్ వంటి రియల్ పాలిటికల్ ఫిగర్స్‌కి స్పష్టమైన పరఫరెన్స్ ఉండటంతో సోషల్ మీడియాలో ఈ సిరీస్ ఓ హాట్ టాపిక్ అయిపోయింది.  వీడియో క్లిప్స్, డైలాగ్స్, థీమ్ మ్యూజిక్.. ఇవన్నీ X (Twitter), insta రీల్స్‌లో హవా చేస్తూ వైరల్ ట్రాక్‌లో దూసుకెళ్తున్నాయి. దేవ కట్ట స్టైల్ ఎలివేట్ చేసిన సీన్స్‌, రాజకీయ వేడి మిలిచే స్క్రీన్‌ప్లే, క్యారెక్టరుల ఎంపిక – ఇవన్నీ కలిసొచ్చి మయసభని ఓ ఇంటెన్స్ పొలిటికల్ డ్రామాగా నిలబెట్టాయి. ఎపిసోడ్‌లలో ఆర్ట్ వర్క్‌, సెట్ డిజైన్, బాడీ లాంగ్వేజ్‌, యాక్షన్‌, ఎమోషన్ అన్నీ రీల్‌లో కాకుండా రీయల్ లాగా అనిపించాయంటే దేవ కట్ట కంటెంట్‌పై ఎంత ప్యాషన్‌తో పని చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఆది పినిశెట్టి, సాయికుమార్, నాజర్, చైతన్య రావు వంటి నటులు రోల్‌లో లైఫ్ పోసేలా నటించారు.


ముఖ్యంగా ఆది చేస్తున్న పాత్రకు బలమైన ప్రెజెన్స్ రావడంతో.. రెండో సీజన్‌కి మంచి ఆస్త‌కి క్రియేట్ అయిపోయింది. డైలాగ్స్, ఎత్తుగడలు, బ్యాక్‌స్టాబ్స్, పవర్ షిఫ్టింగ్ ఇలా ఒక ఎపిసోడ్‌లో ఒక్కసారి చూసేస్తే.. మిగతావి కూడా చూసి తీరాల్సిందే అనిపించేలా మయసభ తీయడం దేవ కట్ట ఫుల్‌ఫలితమనే చెప్పాలి. వివాదాలు వస్తున్నాయంటే, అది సక్సెస్‌కి సింబల్ అని కొందరైతే.. ఇది ఓ ప్రయోగమే కానీ కమర్షియల్‌గా నిలుస్తుందా ? అన్న డౌట్లో ఇంకొంతమంది. కానీ దేవ కట్ట రీఎంట్రీ మాత్రం మాస్ గా జరిగిపోయింది. ఇప్పుడు మయసభ సక్సెస్‌ను కమర్షియల్ ప్యాకేజింగ్‌తో థియేటర్ల వరకూ తీసుకురాగలిగితేనే, దేవ కట్ట పునరాగమనం ఫుల్‌గా కంప్లీట్ అవుతుందనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: