ఏంటి  పెళ్లయిన శివ కార్తికేయన్ ఆ హీరోయిన్ పై మనసు పడుతున్నారా. ఈ హీరోకి ఇదే మాయ రోగం అని అనుకుంటారు చాలామంది నెటిజన్లు. అయితే హీరోలు మనసు పడ్డారు అంటే అది మరో విధమైన అర్థమైతే కాదు.తమ సినిమాలో ఆ హీరోయిన్ ని పెట్టుకోవాలి అనే ఉద్దేశంతోనే.. అయితే తాజాగా శివ కార్తికేయన్ కూడా అలాంటి ఒక నిర్ణయమే తీసుకున్నారట.తన సినిమా కోసం ఆ హీరోయిన్ కావాలి అని పట్టుబడుతున్నారట. మరి ఇంతకీ శివ కార్తికేయన్ ఏ హీరోయిన్ పై మనసు పడుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. వరుస హిట్స్ తో జోరు మీదున్న శివ కార్తికేయన్ ఈ మధ్యనే అమరన్ వంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీ ని తన ఖాతాలో వేసుకున్నారు.ఇక ఈ సినిమా తర్వాత శివ కార్తికేయన్ ప్రస్తుతం సుధా కొంగర డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు.

ఈ సినిమాలో శివ కార్తికేయన్ కి జోడిగా శ్రీ లీల నటిస్తోంది. ఇక ఇందులో శివ కార్తికేయన్ కి విలన్ గా రవి మోహన్ నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే అధర్వ మురళి ఈ మూవీలో కీ రోల్ పోషిస్తున్నారు. శర వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తవబోతోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యాక అక్టోబర్ లో శివ కార్తికేయన్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్లో జాయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. శివ కార్తికేయన్ సుధాక కొంగరతో సినిమా పూర్తయ్యాక వెంకట్ ప్రభుతో తన కొత్త సినిమాని ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే. వెంకట్ ప్రభు డైరెక్షన్లో రాబోతున్న శివ కార్తికేయన్ మూవీ టైం ట్రావెల్ నేపథ్యంలో ఉండబోతుందని ఇప్పటికే కోలీవుడ్ నుండి లీకులు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరైతే బాగుంటుంది అని చిత్ర యూనిట్ సెర్చ్ చేస్తున్నారట.

ఇందులో భాగంగా శివ కార్తికేయన్ తన మూవీలో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ అయితేనే బాగుంటుంది ఆ హీరోయిన్ ని తీసుకోండి అని చెబుతున్నారట. అయితే వేరే హీరోయిన్ కోసం చిత్రయూనిట్ సెర్చ్ చేస్తున్నప్పటికీ తనకు మృణాల్ మాత్రమే కావాలి అంటూ పట్టు బట్టడంతో చిత్ర యూనిట్ కూడా ఈ విషయం పట్ల పాజిటివ్ గానే రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది.త్వరలోనే మృణాల్  ఠాకూర్ ని కలిసి కథ చెప్పి ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ చేయాలను చూస్తున్నట్టు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనప్పటికి మృణాల్ ఠాకూర్ కి వరుస ఫెయిల్యూర్స్ ఎదురైనా కూడా ఇండస్ట్రీలో క్రేజ్ మాత్రం తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: