
బాలీవుడ్ లో ఇన్నాళ్లు ప్రమోషన్స్ నిర్వహించిన టీం . ఇప్పుడు టాలీవుడ్ పై కూడా పడ్డింది . రీసెంట్ గానే హైదరాబాదులో గ్రాండ్ గా ఈ వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది . కాగా ఈ స్టేజిపై ఎన్టీఆర్ చాలా అద్భుతంగా మాట్లాడాడు . తనదైన స్టైల్ లో ఆకట్టుకున్నాడు . మరీ ముఖ్యంగా తారక్ స్టేజిపై మాట్లాడుతూ ఉంటే జనాలు అలా ఆశ్చర్యపోతూ చూసేసారు . సాధారణంగా ఏ స్టార్ హీరో స్పీచ్ ఇస్తున్న బోర్ కొడుతుంది . ఏంటి ఇలా మాట్లాడుతున్నారు..? ఇంకా సుత్తి కొడుతున్నాడు..?? అని అనుకోకు తప్పదు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఉంటే మాత్రం ఇంకా ఇంకా వినాలి అనిపిస్తుంది.
ఎక్కడ కూడా బోరింగ్ లైన్ తీసుకోకుండా సినిమా విషయం ఏంటి ..? సినిమాకి ఎలా కష్టపడ్డాం..? అనే విషయాలను చాలా పక్కాగా మాట్లాడేస్తూ ఉంటాడు. వార్ 2 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లోను జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు బాగా హైలైట్ గా మారాయి. దీంతో మరొకసారి ఇండస్ట్రీలో ఆయనని పొగిడేస్తున్నారు . ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ల స్పీచ్ ఇచ్చే స్టార్ ఎవ్వరూ లేరు అని జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఉంటే అసలు ప్రపంచమే తెలియకుండా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తూ ఉంటుంది అని నందమూరి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్వాలిటీ ఆయనకు తాత గారి దగ్గర నుంచి వచ్చిందేమో అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు . స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు స్టేజ్ ఎక్కి మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటే ఎంత హుందాగా ..ఎంత గంభీరంగా ..ఎంత రెస్పెక్ట్ ఫుల్ గా ఉండేదో ఆ కాలం జనాలని అడిగితే పక్కాగా చెప్పేస్తారు..!!