సాధారణంగా స్టార్ హీరోల గురించి సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వైరల్ అవుతూనే ఉంటాయి. అది యంగ్ హీరో అయినా, స్టార్ హీరో అయినా, సీనియర్ హీరో అయినా – ఎవ్వరైనా సరే – “పలానా హీరోయిన్‌తో అఫైర్ ఉంది” అంటూ రూమర్స్ క్రియేట్ చేస్తుంటారు. పెళ్లి అయ్యి, పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇలాంటి పుకార్లు కొందరు ఆకతాయిలు సృష్టిస్తూనే ఉంటారు. అలాంటి రూమర్స్‌కి స్టార్ హీరోలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే సంసారాలు చెడిపోతాయి, నాశనం అవుతాయి. అయితే, కొన్ని సందర్భాల్లో కొందరు హీరోలు వాటిని పెద్దగా పట్టించుకోకుండా, పదేపదే గుర్తు చేసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి పరోక్షంగా వేరే టాపిక్స్‌లో ఫింగర్పెడుతూ ఉంటారు. ప్రస్తుతం అలాంటి పనే చేశారు జగపతిబాబు, నాగార్జున. దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరి పేర్లు బాగా వైరల్ అవుతున్నాయి.


మనకు తెలిసిందే సీనియర్ హీరో జగపతిబాబు ఇప్పుడు విలన్‌గా పలు సినిమాలలో నటిస్తూ, ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మరోవైపు, ఆయన హోస్ట్‌గా కూడా మారిపోయారు. సీనియర్ హీరో జగపతిబాబు హోస్ట్‌గా చేస్తున్న టాక్ షో గురించి అందరికీ తెలిసిందే. ఈ షోకి తొలి గెస్ట్‌గా కింగ్ నాగార్జున హాజరయ్యారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై, వైరల్ అవుతోంది. అది అంత వైరల్ అవ్వడానికి కారణం ఏమిటా అనుకుంటే — షోలో జగపతిబాబు నాగార్జునను ఓ ప్రశ్న అడుగుతారు: “మీకు బెస్ట్ కో-యాక్ట్రెస్ ఎవరండి? రమ్యకృష్ణనా, లేక టబూనా?” అని..? ఈ ప్రశ్నకు నాగార్జున నవ్వుతూ.. " అలాంటివి కొన్ని కొన్ని చెప్పకూడదు… నేను అసలకే చెప్పను” అంటూ నవ్వుతూనే సమాధానం ఇస్తారు.

 

అలాగే రివర్స్‌లో నాగార్జున కూడా జగపతిబాబును ప్రశ్నిస్తారు: “రమ్యకృష్ణ, సౌందర్య — వీరిద్దరిలో నీ ఫేవరెట్ ఎవరు?” అని..? నాగార్జున అడిగిన ప్రశ్నకు జగపతిబాబు సమాధానం చెప్పకుండా, “ఇది నా ఇంటర్వ్యూ కాదు, సో నేను ఆన్సర్ చెప్పను” అంటూ నవ్వుతూనే దాటవేస్తారు. మొత్తానికి ఈ షోలో ఇద్దరు సీనియర్ హీరోల మధ్య జరిగిన సరదా ముచ్చట్లు ప్రేక్షకులను బాగా అలరించాయి. అయితే, కొందరు మాత్రం దీనిపై నెగిటివ్‌గా స్పందిస్తున్నారు. “ఎందుకండి మీ పాత అఫైర్స్ గురించి ఇలా మాట్లాడుకుంటూ సంసారాలు నాశనం చేసుకుంటారు? సంసారం సాఫీగా ముందుకు వెళ్తుంటే అలాగే వెళ్ళనివ్వండి” అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, జగపతిబాబు హోస్టింగ్ చూస్తుంటే ఈ షో బిగ్ హిట్ అయ్యేలా ఉందని కొంతమంది అభిమానులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: