
ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ — "బాలీవుడ్‌కు ఈ సినిమా ద్వారా నేను పరిచయం కాబోతున్నాను, అలాగే హృతిక్ రోషన్ గారు మన టాలీవుడ్‌కి పరిచయం కాబోతున్నారు. ఇకపై ఆయనను నా అభిమానులు గుండెల్లో పెట్టుకొని అభిమానిస్తారు" అని చెప్పుకొచ్చారు. ఇది ఇన్‌డైరెక్ట్‌గా ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కి చేసిన రిక్వెస్ట్ అని జనాలు అంటున్నారు. కానీ, అలాంటి రిక్వెస్ట్ హృతిక్ రోషన్‌కి అవసరం లేదని కొందరు భావిస్తున్నారు. ఎందుకంటే బాలీవుడ్‌లో ఆయన బడా హీరో. వయసులోనూ, సీనియారిటీలోనూ ఎన్టీఆర్ కంటే పెద్దవాడు. తన ఖాతాలో మంచి సినిమలు కూడా ఉన్నాయ్. అలాంటి హీరోను ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదని, "నువ్వు హైలైట్ అవ్వాలి అనే క్రమంలో హృతిక్ రోషన్‌ను ఇలా కించపరుస్తావా?" అంటూ కొంతమంది బాలీవుడ్ జనాలు మండిపడుతున్నారు.
అంతేకాదు, ప్రొడ్యూసర్ నాగ వంశీ కూడా "తారక్ ని బాలీవుడ్ ఇండస్ట్రీకి తీసుకెళ్లడం కాదు, హృతిక్ రోషన్ గారినే మనం మన టాలీవుడ్‌కి తీసుకొస్తున్నాం" అంటూ మాట్లాడటం బిగ్ సెన్సేషన్‌గా మారింది. అసలే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ అంతంత మాత్రం ఉంది. ఇలాంటి కొన్ని హద్దులు మీరిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమాకి మరింత నెగిటివిటీ క్రియేట్ చేశాయి. చూడాలి మరి, ఆగస్టు 14వ తేదీ రిలీజ్ అయ్యే ఈ సినిమా ఎలాంటి టాక్ అందుకుంటుందో..?