డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి పరిచయాలు అక్కర్లేదు. ఇప్పటివరకు సందీప్ చేసింది రెండు సినిమాలు. అందులో `అర్జున్ రెడ్డి` ఒక‌టి కాగా.. మరొకటి `యానిమ‌ల్‌`. ఈ రెండు సినిమాల‌తోనే సందీప్ రెడ్డి వంగా ఇటు సౌత్ తో పాటు అటు నార్త్ లోనూ భారీ పాపులారిటీ సంపాదించుకున్నాడు. బోల్డ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. అయితే సినిమాల్లో హీరోల చేత బూతు, బోల్డ్ డైలాగులు పలికించడం వల్ల కొంత నెగ‌టివిటీ ఏర్పడినా.. సందీప్ మాత్రం అదేం పట్టించుకోకుండా తన ప‌ని తాను చేసుకుంటూ పోతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తో `స్పిరిట్‌` మూవీని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.


ఇదిలా ఉంటే.. బోల్డ్ నటి గాయత్రి గుప్తా తాజాగా డైరెక్టర్ సందీప్ రెడ్డివంగాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `ఫిదా` చిత్రంలో సాయి ఫ‌ల్ల‌వి ఫ్రెండ్‌గా న‌టించి గుర్తింపు పొందిన గాయ‌త్రి.. రీల్ లైఫ్‌లోనే కాకుండా రియ‌ల్ లైఫ్‌లోనూ ఎన్నో క‌ష్టాలు ఎదుర్కొంది. మీటూ, క్యాస్టింగ్‌ కౌచ్‌ అంటూ గొంతెత్తడంతో ఫిదా త‌ర్వాత గాయ‌త్రికి అవ‌కాశాలు క‌రువ‌య్యాయి. మ‌రోవైపు త‌ల్లిదండ్రుల‌తో విభేదాలు, ఇష్టంలేని పెళ్లి, ఆటో ఇమ్యూన్‌ డిసీజ్‌ బారిన ప‌డ‌టం.. ఇవ‌న్నీ ఆమె లైఫ్‌ను అత‌లాకుత‌లం చేశాయి.


అయితే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగా త‌న‌కు చేసిన స‌హాయాన్ని గుర్తు చేసుకుంది. `నాకు ఆరోగ్యం బాగోలేక ఆసుప‌త్రి పాల‌య్యాను. ట్రీట్మెంట్ కు రూ.15 లక్షల వ‌ర‌కు అవసరం కాగా.. క్రౌడ్ ఫండింగ్ ద్వారా హెల్ప్ అడిగాను. అలా కేవలం రూ.2 లక్షలు మాత్ర‌మే వ‌చ్చాయి. కష్ట కాలంలో ఎవ్వరూ సహాయం చేయలేదు. ఫ్యామిలీ కూడా ప‌ట్టించుకోలేదు. చేతిలో చిల్ల‌గ‌వ్వ లేక దీనస్థితిలోకి వెళ్లిపోయిన సమయంలో డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా గారికి మెసేజ్ చేశాను. ఫిదా సినిమాలో నా నటనను ఆయ‌న మెచ్చుకున్నారు. అప్పటినుంచి మంచి ఫ్రెండ్ అయ్యారు.


ఆయ‌న‌కి నా అనారోగ్య పరిస్థితిని వివరిస్తూ మెసేజ్ పెట్టాను. వెంట‌నే రెస్పాండ్ అయిన ఆయ‌న‌.. మెడిక‌ల్ రిపోర్ట్స్‌, ట్రీట్‌మెంట్‌కు ఎంత ఖర్చు అవుతుందో పెట్టమన్నారు. నేను పీపీటీ చేసి పంపాను. అంతే నేను ఆయ‌న్ను డైరెక్ట్‌గా క‌ల‌వ‌లేదు. క‌నీసం ఫోన్‌లో కూడా మాట్లాడ‌లేదు. అయిన కూడా ఆయ‌న వారం రోజుల్లోనే రూ.5.5 లక్షలు పంపించాడు. కేవ‌లం నా బాధ‌ను అర్థం చేసుకుని డ‌బ్బు పంపారు. సందీప్ చేసిన సహాయం ఎప్పటికీ మరిచిపోలేను` అంటూ గాయ‌త్రి గుప్తా చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మార‌డంతో.. సందీప్‌లో ఈ కోణం కూడా ఉందా అంటూ నెటిజ‌న్లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. డైరెక్ట‌ర్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: